విజయవాడ నుంచి పవన్ ఎన్నికల ప్రచారం

  • Published By: veegamteam ,Published On : January 1, 2019 / 10:12 AM IST
విజయవాడ నుంచి పవన్ ఎన్నికల ప్రచారం

విజయవాడ : ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పవన్ కళ్యాణ్ పూరించాడు. విజయవాడ నుంచి 2019 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు పవన్ ప్రకటించారు. ఈవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు బంగారు భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. ఏపీ పునర్నిర్మాణంలో జనసేన కీలక పాత్ర పోషించాలని కోరారు.

పవన్ రాజకీయ ప్రవేశంతో ఏపీలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దుతు ఇచ్చారు. కానీ ఈసారి సొంతంగా ఎన్నికల బరిలో దిగుతున్నట్లు కనిపిస్తోంది. జనసేనకు ఎన్నికల గుర్తు గ్లాస్ వచ్చిన సంగతి తెలిసిందే.