ఏపీని వణికిస్తున్న కరోనా : మొత్తం 439 కేసులు..గుంటూరులో 93

  • Published By: madhu ,Published On : April 14, 2020 / 02:10 AM IST
ఏపీని వణికిస్తున్న కరోనా : మొత్తం 439 కేసులు..గుంటూరులో 93

Updated On : April 14, 2020 / 2:10 AM IST

ఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. రోజురోజుకు జడలు విప్పుతోంది. 2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 439కి  చేరింది. నిన్న ఒక్కరోజు 19 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో అత్యధికంగా 93 కేసులు గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందారు. అనంతపురం, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించగా.. కర్నూల్‌ జిల్లాలో ఒక కోవిడ్‌ మృతి నమోదైంది. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో 401 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే ఇప్పటివరకు 12మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ కారణంగా ఆసుపత్రుల్లో 420 మంది చికిత్స  పొందుతున్నారు. అలాగే ఇప్పటివరకు 12మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు అధికారులు తెలిపారు. 

ఇక జిల్లాల వారిగా చూస్తే.. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 93 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 84, నెల్లూరులో 56, కృష్ణా జిల్లాలో 36, ప్రకాశంలో 41, కడప 31, పశ్చిమ గోదావరిలో 23, చిత్తూరు జిల్లాలో 23,  విశాఖపట్నంలో 20, అనంతపురంలో 15, తూర్పుగోదావరి జిల్లాలో 17 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.   

Also Read | కలిచివేసే దృశ్యం : ఒలికిన పాలను..ముంతలో పట్టుకొనే ప్రయత్నం