Andhra Pradesh : ఏపీలో కరోనా కల్లోలం : 24 గంటల్లో 24 వేల 171 కేసులు, 101 మంది మృతి

ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 24 వేల 171 మందికి కరోనా సోకింది. 101 మంది చనిపోయారు.

Andhra Pradesh : ఏపీలో కరోనా కల్లోలం : 24 గంటల్లో 24 వేల 171 కేసులు, 101 మంది మృతి

Ap Corona cases

Updated On : May 16, 2021 / 6:30 PM IST

COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 24 వేల 171 మందికి కరోనా సోకింది. 101 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 2, 10, 436 యాక్టివ్ కేసులు ఉండగా..9 వేల 372 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 21, 101 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 1,79,75,305 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది.

దీని కారణంగా అనంతపూర్ లో 14 మంది, విశాఖపట్టణంలో 11 మంది, చిత్తూరులో 10 మంది, తూర్పు గోదావరిలో తొమ్మిది మంది, గుంటూరులో తొమ్మిది మంది, కృష్ణాలో తొమ్మిది మంది, విజయనగరంలో తొమ్మిది మంది, నెల్లూరులో ఏడుగురు, కర్నూలులో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, వైఎస్ఆర్ కడపలో ఇద్దరు మరణించారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 3356. చిత్తూరు 2885. ఈస్ట్ గోదావరి 2876. గుంటూరు 1787. వైఎస్ఆర్ కడప 1638. కృష్ణా 706. కర్నూలు 730. నెల్లూరు 1593. ప్రకాశం 1628. శ్రీకాకుళం 1509. విశాఖపట్టణం 2041. విజయనగరం 997. వెస్ట్ గోదావరి 2426. మొత్తం : 24,171.

Read More : 10 Year Girl In Gaza : కన్నీటి పెట్టిస్తున్న’గాజా‘ చిన్నారి : డాక్టర్ని అయి పేదలకు సేవచేయాలనుకున్నా.. నా కలలు నాశనం చేశారు..