దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్..

Daggubati Purandeswari: బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి కరోనా బారినపడ్డారు. ఆమెకు అనారోగ్యంగా ఉండడంతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే లక్షణాలు ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పురందేశ్వరి ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే పురందేశ్వరికి కరోనా సోకి ఉండవచ్చని సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
కాగా మంగళవారం(సెప్టెంబర్ 29) ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు.
देश के उपराष्ट्रपति माननीय श्री वेंकैया नायडू जी के कोरोना संक्रमित होने का समाचार प्राप्त हुआ। हम ईश्वर से उनके जल्द स्वस्थ होने की कामना करते हैं ?#VenkaiahNaidu pic.twitter.com/I6HPVlajPE
— Daggubati Purandeswari (@PurandeswariBJP) September 30, 2020