రాజధానిపై 27న నిర్ణయం..బాబు మాటలు నమ్మవద్దు – బోత్స

రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం భూములు అభివృద్ధి చేసి ఇస్తాం..రాజధానిపై డిసెంబర్ 27వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటాం..బాబు చెబుతున్న మాటలను నమ్మవద్దని అంటున్నారు మంత్రి బోత్స. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బాబు మోసం చేస్తున్నారని, మోసపూరిత మాటలను నమ్మవద్దని అమరావతి ప్రజలకు సూచించారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం మంత్రి బోత్స మీడియాతో మాట్లాడారు. అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ కొనసాగుతుందన్నారు.
రాజధాని మార్పుపై బాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టుతో అభివృద్ధి సాధ్యం కాదని బాబు అంటున్నారనే విషయాన్ని ఆయన వెల్లడించారు. గత పాలకులు విశాఖను ఏదైనా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. రాజధానిపై డిసెంబర్ 27వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. GN RAO నివేదికపై కేబినెట్ లో చర్చిస్తామన్నారు.
కమిటీ ఏం చెప్పిదంటే : –
* శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు కర్నూలులో ఉండాలి.
* అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా.
* అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ తయారు చేయాలని జీఎన్ రావు కమిటీ సూచించిందన్నారు.
మూడు రాజధానులంటూ సీఎం చేసిన ప్రకటన, GN RAO కమిటీ నివేదిక ఇవ్వడంపై రాజధాని రైతులు భగ్గుమంటున్నారు. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారానికి ఆరో రోజు చేరుకుంది. వినూత్నంగా నిరసలు, ఆందోళనలు చేస్తున్నారు.
Read More : బీజేపీకి షాక్ : NRC బిల్లుకు వ్యతిరేకం – సీఎం జగన్ ప్రకటన