Gossip Garage : వైసీపీ ప్లాన్ బెడిసికొట్టిందా? ఆ విధంగా కూటమి కార్యకర్తల్లో విభేదాలకు పవన్, లోకేశ్ చెక్..!
బయట జరుగుతోన్న ప్రచారానికి, వైసీపీ చేస్తుందని చెప్తున్న ఫేక్ క్యాంపెయిన్‌కు కూటమి పార్టీలు చెక్ పెట్టినట్లు అయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Gossip Garage : గ్యాప్ అన్నారు. పొలిటికల్‌గా ఒకరి మీద ఒకరి పైచేయి సాధించే స్కెచ్ అని ఊదరగొట్టారు. ఆయనకు ఎర్త్ పెట్టేందుకే..చిన్నబాబు డిప్యూటీ సీఎం అంటూ..తెలుగు తమ్ముళ్లు ఎలివేషన్ ఇచ్చారని కూడా హడావుడి చేశారు. కానీ ఆ ఇద్దరు మాత్రం క్లియర్‌గా ఉన్నారు. నో కన్ఫ్యూజన్..నో గ్యాప్..ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటున్నారు.
కూటమిగా ఉన్నాం..కలిసే నడుస్తాం..ఏదైనా ఉంటే మాట్లాడి నిర్ణయించుకుంటామని చెప్పకనే చెప్తున్నారు. మొన్న టీడీపీ..నేడు జనసేన లేఖల ఉద్దేశమేంటి..? డిప్యూటీ సీఎం పోస్ట్‌పై లోకేశ్‌కు ఆశ లేదా? ఆ ఇద్దరు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి..వైసీపీ ప్లాన్‌కు, కూటమి కార్యకర్తల్లో విభేదాలకు చెక్ పెట్టారా?
ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా పవన్, లోకేశ్ మధ్య సఖ్యత..
నో క్లాషెన్. నో గ్యాప్స్. వీఆర్ ఇన్ అలయన్స్. వీఆర్ ఇన్ గవర్నమెంట్. నో డిస్టాన్స్..ఓన్లీ ఫ్రెండ్షిప్ అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్, ఏపీ మంత్రి నారా లోకేశ్. బయట జరుగుతోన్న ప్రచారానికి చెక్ పెట్టేలా ఆ ఇద్దరు నేతలు సఖ్యతగా ఉంటూ..రిపబ్లిక్‌డే వేడుకల్లో ఆప్యాయంగా మాట్లాడుకుని..నవ్వుకుంటూ కనిపించారు.
Also Read : ఏపీలో అందరికీ ఇళ్లు స్కీమ్.. రూల్స్ ఇవే.. మీకు వస్తుందో రాదో చెక్ చేసుకోండి..
పవన్‌తో సమానంగా లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నట్లు చక్కర్లు కొట్టిన గాలి వార్తలు గాలికే పోయేలా.. పవన్, లోకేశ్ ఒకే స్టాండ్‌ను మెయింటెన్ చేస్తున్నారు. పార్టీల పరంగా టీడీపీ, జనసేన కూడా నో కామెంట్..ప్లీజ్ సైలెన్స్ అంటూ నేతలకు ఆదేశాలు ఇవ్వడం కూడా అనవసర వివాదాలకు ఎండ్ కార్డు వేసే ప్రయత్నమేనన్న చర్చ జరుగుతోంది.
వారం రోజుల కింద ఏపీలో ఒకటే రచ్చ. అదే డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్. టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు..వరుస పెట్టి తెలుగు తమ్ముళ్లు స్టేట్‌మెంట్లతో నాలుగైదు రోజులు హాట్ టాపిక్‌గా నడిచింది. అటు జనసేన కూడా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్‌పై రియాక్ట్ అవడం ఇంకా కాక రాజేసింది. పవన్‌ను సీఎంగా చూడాలనుకుంటున్నామని జనసేన నేతలు చెప్పడంతో కూటమి పాలిటిక్స్ హీటెక్కాయి.
పదవుల మీద పెద్దగా ఆశ లేదని క్లారిటీ..
ఈ నేపథ్యంలోనే లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవిపై ఏం మాట్లాడొద్దని నేతలకు హుకూం జారీ చేసింది టీడీపీ అధిష్టానం. ఆ తర్వాత చంద్రబాబు, లోకేశ్ ముందే మంత్రి టీజీ భరత్ లోకేశ్ ఫ్యూచర్ సీఎం అంటూ బాంబ్ పేల్చారు. ఆ తర్వాత ఆయనకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారన్న వార్తలతో ఆ ఇష్యూ అంతటితో ఆగిపోయిందని అనుకున్నారు. లోకేశ్ కూడా దావోస్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్ట్‌పై స్పందించారు. తనకు పదవుల మీద పెద్దగా ఆశ లేదని.. చేయాల్సిన పని మీదే దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు.
పదవుల కోసం రాజకీయం చేయలేదని స్టేట్ మెంట్..
జనసేన నాయకులను ఉద్దేశించి ఆ పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. కూటమి ఆశయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న ఆయన ..అనవసరమైన వివాదాల జోలికి వెళ్లొద్దని కార్యకర్తల, నేతలకు సూచించారు.
Also Read : గురుమూర్తి ఒళ్లు గగుర్పొడిచే పని.. భార్య మాధవి మృతదేహం కాలుతున్న సమయంలో
సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలపై స్పందించొద్దని, కూటమి అంతర్గత విషయాలపై కూడా బహిరంగంగా మాట్లాడొద్దని కోరారు. తాను ఏ రోజు పదవుల కోసం రాజకీయం చేయలేదని ..భవిష్యత్‌లో కూడా పదవుల కోసం పాలిటిక్స్ చేయబోనని తేల్చి చెప్పారు.
ఉపముఖ్యమంత్రి పదవిపై మరోసారి లోకేశ్ క్లారిటీ..
తనకు డిప్యూటీ సీఎం పోస్ట్‌పై విశాఖ వేదికగా మరోసారి క్లారిటీ ఇచ్చారు లోకేశ్. ఉపముఖ్యమంత్రి పదవి అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తానన్న ఆయన..ఒక వ్యక్తి ఒక పదవిలో 3 సార్లు మాత్రమే కొనసాగాలనేది తన అభిప్రాయమన్నారు. అందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా మరొకరికి అప్పగిస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తగా..చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తానంటున్నారు లోకేశ్.
అటు పవన్ లేఖ..డిప్యూటీ సీఎం పోస్ట్‌పై ఇటు లోకేశ్ క్లారిటీ..కూటమి కార్యకర్తల్లో విభేదాలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరి స్టేట్‌మెంట్‌తో పదవులపై పార్టీల మధ్య మాటల యుద్ధానికి ఇక తెరపడుతుందా..లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆధిపత్య పోరు పేరుతో ప్రత్యర్థులకు అస్త్రంగా మారొద్దనే పవన్, లోకేశ్‌తో పాటు జనసేన, టీడీపీ పార్టీలు డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.
ఏది ఏమైనా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ చేసిన కుట్రలకు తెరపడిదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. నాయకుల మధ్య విబేధాలు ఉన్నాయని ఫ్యాన్ పార్టీ లీడర్లు సోషల్ మీడియా ప్రచారంతో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని..దానికి తమ నేతలు ఆదిలోనే బ్రేకులు వేశారని చెప్పుకొస్తున్నారు కూటమి కార్యకర్తలు, నేతలు.
సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను బేస్ చేసుకుని..కొందరు టీడీపీ నేతలు తమ అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పడంతో..కూటమిలో పంచాయితీ అన్నట్లుగా సీన్ కన్వర్ట్ అయిందంటున్నారు. ఇంతలోనే అలర్ట్ అయిన టీడీపీ, జనసేన చీఫ్‌లు నో కామెంట్.. అనవసర విషయాల జోళికి వెళ్లొద్దంటూ నేతలు, క్యాడర్‌కు ఆదేశాలు ఇచ్చారు.
దీంతో బయట జరుగుతోన్న ప్రచారానికి, వైసీపీ చేస్తుందని చెప్తున్న ఫేక్ క్యాంపెయిన్‌కు కూటమి పార్టీలు చెక్ పెట్టినట్లు అయిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రకటన, లోకేశ్ స్టేట్‌మెంట్ తర్వాత టీడీపీ, జనసేన లీడర్లు, క్యాడర్ సైలెంట్ అవుతారా లేదా అని వేచి చూడాలి మరి.