Gossip Garage: జగన్ పరిస్థితి ఏంటి? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? రెంటపాళ్ల ఎపిసోడ్ లో నెక్ట్స్ ఏం జరగబోతోంది..
జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది.

Gossip Garage: ఆయన టూర్ ముగిసి వారం అయింది. అయినా డైలీ అదే హాట్ టాపిక్‌గా ఉంటోంది. రోజుకో డెవలప్‌మెంట్..విమర్శకు, ప్రతి విమర్శ..అంతకు మించి కేసులు, నోటీసులు, కారు సీజ్‌తో..పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. వైసీపీ అధినేత ఏకంగా కోర్టు మెట్లెక్కారు. అటు జగన్ సెక్యూరిటీ, భద్రతకు ఢోకా లేదంటూ..పెద్ద షాకే ఇస్తుంది ప్రభుత్వం. రెంటపాళ్ల ఎపిసోడ్ ఎటువైపు టర్న్ తీసుకోబోతోంది? కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది? జగన్‌ను విచారణకు పిలుస్తారా? పోలీసులు వెహికల్ సీజ్ చేశారంటే..వాట్ నెక్స్ట్?
అధికారం మారిన వన్ ఇయర్‌లోనే ఏపీ పాలిటిక్స్ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ పాలిటిక్స్‌లో..ఏదో ఒక టాపిక్ హెడ్‌లైన్‌గా ఉంటూనే ఉంది. లేటెస్ట్‌గా గుంటూరు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన ఏపీ రాజకీయాల్లో పెను దుమారం లేపింది. టూర్‌కు అనుమతి లేదంటూనే సెక్యూరిటీ విషయంలో సర్కార్ జాగ్రత్తలు తీసుకుంది. అయినా జగన్ పర్యటనలో కొందరు ప్లకార్డులు ప్రదర్శించడం..ఆ తర్వాత మాటల యుద్ధం..కార్యకర్త మరణంపై బయటికొచ్చిన వీడియోతో..వారం రోజులుగా రెంటపాళ్ల టూర్ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది.
ఈ ఇష్యూలో ఇప్పటికే వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆయన డ్రైవర్, పలువురు ఫ్యాన్ పార్టీ లీడర్లను నిందితులుగా చేరుస్తూ కేసులు పెట్టారు పోలీసులు. జగన్ డ్రైవర్‌ను అరెస్ట్ చేయగా..సింగయ్య మృతి కేసులో ఏ2గా ఉన్న జగన్‌కు నోటీసులు ఇచ్చారు. ఇదే సమయంలో..జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా సింగయ్య మృతి కేసు విచారణలో భాగమంటూ..పోలీసులు వైఎస్ జగన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
కేసులు, విచారణలు ఫేస్ చేయక తప్పదా..?
మరోవైపు రెంటపాళ్ల టూర్‌పై రచ్చ నడుస్తుండగానే జగన్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కొత్త కేసు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ వైసీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారనేది ఫిర్యాదు.!. ఇదే సమయంలో..మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారనేది కూడా అభ్యంతరం ఉంది. ఆ కేసు అలా ఉండగానే సింగయ్య మృతి కేసులో జగన్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలంటూ సూచించారు. అయితే ఈ కేసుపై జగన్‌తో సహా నిందితులుగా ఉన్నవారంతా ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పరిస్థితుల్లో న్యాయస్థానం తీర్పు ఎలా ఉండబోతుంది..కేసులు, విచారణలు ఫేస్ చేయక తప్పదా..అనేది ఉత్కంఠ రేపుతోంది.
మరోవైపు మాజీ సీఎంగా తనకు సరైన భద్రత ఇవ్వడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అయితే జగన్ అలిగేషన్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. రెంటపాళ్ల పర్యటనకు అనుమతి లేకున్నా వందల మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పించామని..వైసీపీ క్యాడర్ రెచ్చిపోయినా పోలీసులు సంయమనంతో ఉన్నారని రివర్స్ అటాక్ చేస్తోంది కూటమి సర్కార్.
జగన్ ప్రాణాలకు ఏమీ ముప్పులేదని కోర్టుకు చెప్పారు..
గతంలో చంద్రబాబును ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకుని..పవన్‌ను రోడ్డు మీదే ఆపేసి..లోకేశ్ కార్లకు అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు పెట్టిన జగన్..ఇప్పుడు భద్రత విషయంలో నీతులు చెప్పడం భలే ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు. సేమ్‌టైమ్ జగన్ భద్రతపై హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పరిశీలిస్తే జగన్‌కు షాక్ తప్పేలా లేదు. ప్రస్తుతం జడ్ క్యాటగిరీ భద్రతలో ఉన్న జగన్..తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున జడ్ ప్లస్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని కోర్టులో పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం జగన్‌కు జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత అవసరం లేదంటున్నారు. ఆ స్థాయిలో భద్రత కల్పించేందుకు ఆయన ప్రాణాలకు ఏమీ ముప్పులేదని కోర్టుకు చెప్పారు.
ఇలా రెంటపాళ్ల టూర్ జగన్ చుట్టూ కేసులు, విచారణలతో కాక పుట్టిస్తోంది. ఓటమి తర్వాత జగన్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో ఆయనను సాధారణ ఎమ్మెల్యేగా పరిగణిస్తూ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ సీఎంకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ కల్పిస్తోంది. కానీ జగన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్తూ సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీ అంటే..అప్పుడు తన భద్రతను పర్యవేక్షించిన తొమ్మిది వందల మంది స్థానంలో సగం మందిని అయినా కేటాయించాలంటున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు.
రెంటపాళ్ల రచ్చ కొనసాగుతుండగానే జగన్ సెక్యూరిటీ అంశం కూడా కీలకంగా మారింది. ఇదే సమయంలో తమ మీద నమోదైన కేసుల విషయంలో..జగన్ వైసీపీ నేతలు వేసిన క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? ఆ తర్వాత ప్రభుత్వం కౌంటర్ యాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి.