Vijayawada Rains : విజయవాడలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!

Vijayawada Rains : నగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచాయి. 

Vijayawada Rains : విజయవాడలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం!

Heavy rains lash parts of Andhra Pradesh ( Image Source : Google )

Updated On : June 13, 2024 / 9:30 PM IST

Vijayawada Rains : విజయవాడలో భారీవర్షం కురిసింది. నగరంలో గురువారం ఉదయం (జూన్ 13) నుంచి ఎండ వేడిమితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే, ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఒక్కసారిగా వాతావరణం
మారిపోయింది. నగర వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ శబ్దాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచాయి.

Read Also : Vivo X Fold 3 Pro : వివో ఎక్స్ ఫోల్డ్ ప్రో సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంతో తెలుసా?

ముఖ్యంగా విజయవాడ రూరల్ వ్యాప్తంగా పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం ధాటికి నగర శివారులో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ నీటితో పాటు వర్షం నీరు రోడ్లపై ప్రవహిస్తుంది.

ముందుస్తు భద్రతా చర్యలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Read Also : Pradeep K Vijayan : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. అనుమానాస్పద స్థితిలో ప్ర‌ముఖ న‌టుడి మృతి..