తేనెటీగల దాడిలో ఇరిగేషన్ డీఈ మృతి, కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం

కర్నూలు జిల్లాలోని భానకచర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఇరిగేషన్ డివిజినల్ ఇంజనీర్(డీఈ) భానుప్రకాష్ మృతి చెందారు. భానుప్రకాష్ పై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రకాష్ ప్రాణాలు కోల్పోయారు. హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఎస్‌ఆర్‌బీసీ గేట్ల తనిఖీ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాష్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబీకులు కన్నీరుమున్నీగా విలపిస్తున్నారు. తేనెటీగల దాడిలో మరో వ్యక్తి గాయపడ్డాడు.