అమరావతి విషయంలో చేసిన తప్పే మళ్లీ మళ్లీ చేస్తున్నారా? ఎన్నికలను మించి.. వైసీపీకి డ్యామేజ్!
వైసీపీ అధినేత, ఆయన సన్నిహితులు మాత్రం రాజధాని మ్యాటర్‌లో తమ స్టాండ్ ఏంటో చెప్పకుండానే..అనుచిత వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిపోతున్నారు.

కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ పాలనను పూర్తి చేసుకుంది. వైసీపీ అపోజిషన్‌లోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ సంవత్సర కాలంలో పోరాడి నిలబడాల్సిన వైసీపీ ఇంకా అయోమయంలో పడిందా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఆ పార్టీ తప్పుల మీద తప్పులు చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఎప్పుడు నిరసనలు చేయాలో..ఏ విషయంలో ఎప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించకుండా..అడ్డగోలు నిర్ణయాలు, ఇష్టం వచ్చిన స్టేట్‌మెంట్లతో ఫ్యాన్ పార్టీ ఇంకా ఇరకాటంలో పడుతుందన్న ఒపీనియన్స్ వ్యక్తం అవుతున్నాయి. ఏ విషయంలో అయితే ఎక్కువగా గెలుక్కోవద్దో..అలాంటి ఇష్యూల్లోనే వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలు అవసరానికి మించి మాట్లాడుతుండటం..ఫ్యాన్ పార్టీ క్యాడర్, లీడర్లను గందరగోళంలోకి నెట్టేస్తుందట. మామూలుగా అయితే అపోజిషన్‌లోకి వచ్చాక పార్టీ బలపడటం చూస్తుంటాం.
కానీ వైసీపీ మాత్రం రివర్స్ గేర్‌లో వెళ్తుందన్న టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్షం నుంచి బలపడి అధికారం దిశగా ఎదగాల్సిన వైసీపీ..అమరావతి డిబేట్ ఇష్యూను సమర్ధించుకునే ప్రయత్నంతో ఇంకా ఇంకా కార్నర్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
లేటెస్ట్ కాంట్రవర్సీ అమరావతి దేవతల రాజధాని కాదు..మరో విధమైన రాజధాని అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ కామెంట్ చేయడం..ఆ డిస్కస్ హోస్ట్‌గా ఉన్న మరో సీనియర్ జర్నలిస్ట్ దానిని వెంటనే ఆపకపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు, కేసులకు కారణమైంది.
Also Read: శాఖల్లో సమూల మార్పులకు శ్రీకారం.. మంత్రుల్లో టెన్షన్
ఆ జర్నలిస్ట్ చేసిన కామెంట్సే దుమారం లేపుతున్నాయంటే..వైసీపీ ముఖ్యనేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ మరింత ఇష్యూ అవుతున్నాయి. పిశాచాలు కూడా ఇలా చేయరేమో.? వారిని రాక్షసులు అని కూడా అనలేం. అందరూ కలిసి సంకరం అయినట్టుంది. ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదో ఒకటున్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇలా చేయగలదు అంటూ సజ్జల చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి.
సజ్జలపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందోనన్న సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. కుల వివక్షకు సంబంధించిన పదం వాడిన సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు పెట్టారని కోరారు. ఇది ఇలా ఉంటే ఆ సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్‌పై వైసీపీ అధినేత జగన్ ట్వీట్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.
సెన్సిటివ్ అంశాన్ని హ్యాండిల్ చేయడంలో ఫ్యాన్ పార్టీ విఫలం?
జరుగుతోన్న..జరగబోయే నష్టాన్ని అంచనా వేయడంలో వైసీపీ థింక్ ట్యాంక్ కచ్చితంగా ఫెయిల్ అయిందనేది ఎనలిస్టుల అభిప్రాయం. మహిళలతో ముడిపడి ఉన్న ఇష్యూ..పైగా అమరావతి రాజధానిగా ఏపీ ప్రజల సెంటిమెంట్‌గా ఉంది. అలాంటి సెన్సిటివ్ అంశాన్ని హ్యాండిల్ చేయడంలో ఫ్యాన్ పార్టీ విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది. లాస్ట్‌కు ఇప్పుడు ఈ ఇష్యూలో వైసీపీ నేతలెవరూ స్పందించేందుకు మీడియా ముందుకు రాలేని పరిస్థితి.
మొదటినుంచి మూడు రాజధానుల వ్యవహారంతో అమరావతి రైతులు వర్సెస్ జగనన్నట్టుగా రాజధాని ప్రాంతంలో పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాజధాని అంశం వైసీపీకి ఓటమికి కారణమైవాటిల్లో ప్రధానమైంది. అమరావతి రైతుల విషయంలో జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు, ఏపీకి రాజధానే లేకుండా చేశారన్న విమర్శలతో..ఎన్నికల్లో ఘోర పరాజయం కావాల్సి వచ్చింది.
ఆ తర్వాత కూడా రాజధానిపై వైసీపీ తన స్టాండ్‌ను మార్చకున్నట్లు కనిపించడం లేదు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎలానో సరి చేసుకుంటుంటాయి. కానీ వైసీసీ మాత్రం తెగే దాక లాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆ పార్టీ నేతల్లో కొందరు అయితే అమరావతి ఒక్కటే రాజధాని అని చెప్పేస్తున్నారు. ప్రజలు అంతగా తీర్పు ఇచ్చాక మళ్లీ మూడు రాజధానుల జోలికి వెళ్లబోమని కూడా అంటున్నారు.
కానీ వైసీపీ అధినేత, ఆయన సన్నిహితులు మాత్రం రాజధాని మ్యాటర్‌లో తమ స్టాండ్ ఏంటో చెప్పకుండానే..అనుచిత వ్యాఖ్యలతో ఇరకాటంలో పడిపోతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ వైసీపీకి తీవ్ర నష్టం చేసేదే. సదరు జర్నలిస్ట్ అలాంటి వ్యాఖ్యలు చేయగానే దానికి సరైన వివరణ ఇస్తే వివాదం అంతటితో ముగిసిపోయే అవకాశం ఉండేది. కానీ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తుండటంతో వైసీపీపై నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇలా ఫ్యాన్ పార్టీ వ్యూహాత్మక పొరపాటు టీడీపీకి అస్త్రంగా మారుతుంది. జరుగుతున్న పరిణామాలను ఎమోషన్‌తో కాకుండా ఎనలైజ్ చేసుకుని ముందుకు వెళ్తేనే వైసీపీకి మంచిదన్న అభిప్రాయం వినిపిస్తోంది.