KA Paul: అలా చేయాలని షర్మిలకు నేనే చెప్పాను: కేఏ పాల్
ఏపీలో అన్ని స్థానాల నుంచి ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు.

ka paul
ప్రజలకు సీఎం జగన్ నమ్మకద్రోహం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. చివరకు తల్లి, చెల్లిని కూడా మోసం చేశారని ఆరోపించారు. షర్మిల పాదయాత్ర చేయకపోతే జగన్ అధికారంలోకి వచ్చేవారా అని ప్రశ్నించారు.
తెలంగాణ ఎన్నికల ముందు వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని షర్మిలకు తానే చెప్పానన్నారు. జగన్, విజయసాయి రెడ్డి జైలుకి వెళ్తారని కేఏ పాల్ చెప్పారు. తాను చాలా మంది సీఎంలను కలిశానని అన్నారు. తనకు గౌరవం ఇవ్వనివారు జగన్, చంద్రబాబు మాత్రమేనని తెలిపారు.
అభివృద్ధి చేసే తాను కావాలో, సర్వ నాశనం చేసే జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలని కేఏ పాల్ చెప్పారు. తాము శాంతియుతంగా యుద్ధం చేస్తామని అన్నారు. తాను విశాఖను ఇంటర్ నేషనల్ సిటీగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఏపీలో అన్ని స్థానాల నుంచి ప్రజా శాంతి పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. విజయ సాయిరెడ్డికి, బొత్స సత్యనారాయణకి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయా? లేదా? అని నిలదీశారు.