నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే సీఎం జగన్ కూడా మాజీ సీఎం అవుతారు- కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

నాకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారని పాల్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదని వాపోయారు.

నాకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే సీఎం జగన్ కూడా మాజీ సీఎం అవుతారు- కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul Sensational Comments On CM Jagan (Photo : Google)

Updated On : January 9, 2024 / 4:44 PM IST

KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసేందుకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అయితే అనుమతి రాలేదని కేఎ పాల్ కు పోలీసులు తెలిపారు. క్యాంపు కార్యాలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలని ఆయనతో చెప్పారు. పాల్ మాత్రం అక్కడే ఉన్నారు. అపాయింట్ మెంట్ కోసం గంట సేపు క్యాంప్ ఆఫీస్ మెయిన్ గేట్ వద్ద వేచి చూశారు. చివరికి సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో క్యాంప్ కార్యాలయం నుంచి నిరాశగా తిరిగి వెళ్లిపోయారు కేఏ పాల్.

Also Read : చంద్రబాబుపై విమర్శలు చేసిన కేఏ పాల్.. పవన్ కల్యాణ్‌కు మాత్రం ఓ రిక్వెస్ట్.. అదేమిటంటే?

ఈ సందర్భంగా మాట్లాడిన కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది దేశాధినేతలు నేను అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారు అని చెప్పారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సైతం నాకు అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని వెల్లడించారు. కేసీఆర్ సీఎంగా ఉండగా కలిసేందుకు 80సార్లు అపాయింట్ మెంట్ అడిగినా ఇవ్వలేదని వాపోయారు. నాకు అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్ మాజీ సీఎం అయ్యారని పాల్ వ్యాఖ్యానించారు. మాజీ సీఎం అయ్యాకే కేసీఆర్ నాకు అపాయింట్ మెంట్ ఇచ్చిన పరిస్థితి చూశారు అని చెప్పారు. రేవంత్ రెడ్డి సైతం సీఎం అయ్యాక నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారని తెలిపారు.

Also Read : రాష్ట్రంలో పరిస్థితులపై సీఈసీకి ఫిర్యాదు చేశాం.. వాళ్లను ఎన్నికల్లో ఉపయోగించొద్దని కోరాం

”ఏపీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ కోసం ఇవాళ, రేపు విజయవాడలోనే ఉండి వేచి చూస్తా. అపాయింట్ మెంట్ ఇస్తే సీఎంతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తా. జగన్ కు రహస్యాలు చెబుతా. నాకు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే సీఎం వైఎస్ జగన్ కూడా మాజీ సీఎం అవుతారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారో 75 సీట్లు గెలుస్తారో 25 సీట్లు గెలుస్తారో నాకు తెలియదు” అని కేఏ పాల్ అన్నారు.

Also Read : వైఎస్ మరణంపై వైసీపీ ఆరోపణలు సరికాదు.. జగన్ తాడేపల్లి నుంచి బయటకొస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది