KA Paul: అప్పట్లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇలాగే చేస్తున్నారు: కేఏ పాల్
పవన్ కల్యాణ్‌కు రూ.1,500 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.

KA Paul
KA Paul – Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్న జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. ఇవాళ విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి అమ్ముడుపోయారని, ఇప్పుడేమే అచ్చం అలాగే పవన్ కల్యాణ్ అమ్ముడుపోయారని కేఏ పాల్ అన్నారు. పార్టీలను అమ్ముకోవడానికే మాత్రమే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్‌కు రూ.1,500 కోట్లు ఇచ్చారని ఆరోపించారు.
ఆ డబ్బుంతా హాంకాంగ్, దుబాయ్ నుంచి పవన్ కల్యాణ్ అకౌంట్లో పడిందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. అందుకే ఆయన 25 సీట్లకు పరిమితమైపోయారని చెప్పారు. పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే కాపులు నష్టపోతారని కేఏ పాల్ అన్నారు.
కాగా, ఎన్నికల వేళ కేఏ పాల్ పదే పదే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తెలంగాణ నుంచి పోటీ చేస్తానని కొన్ని వారాల క్రితం కేఏ పాల్ చెప్పారు. తన పార్టీని బలపర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.