ఒక్క చాన్స్ అంటూ సీఎం అయ్యి రైతులను అపహాస్యం చేస్తున్నారు
టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్.. ఇప్పుడు రైతులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్.. ఇప్పుడు రైతులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సీఎం అయిన జగన్.. ఇప్పుడు రైతులను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. నాడు రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతులు.. నేడు అదే రాజధాని కోసం పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. రైతుల పరిస్థితి చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. రాజధాని తరలింపును తాము అంగీకరించము అని చెప్పారు. ప్రాణాలు పణంగా పెట్టి పోరాడతామన్నారు.
రాజధాని వస్తుందన్న వార్తతో విశాఖవాసులు భయపడుతున్నారని కేశినేని నాని చెప్పారు. ఎక్కడ భూకబ్జాలు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారని కేశినేని నాని వెల్లడించారు. అమరావతి రాజధానిగా నాడు అసెంబ్లీలో అంగీకారం తెలిపిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చడం కరెక్ట్ కాదన్నారు. సీఎం జగన్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మరోవైపు సీఎం జగన్ కు టీడీపీ నేత దేవినేని ఉమ సవాల్ విసిరారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇప్పుడు పాదయాత్ర చేయగలరా అని జగన్ కు సవాల్ విసిరారు. పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల్లో.. కనీసం ఒక్క గ్రామంలో అయినా పాదయాత్ర చేయగలరా? అని ప్రశ్నించారు. జగన్ నే కాదు ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే అక్కడ తిరగగలరా అని ప్రశ్నించారు.
కనీసం రైతుల నిరసన గురించి మాట్లాడగలరా? అని ప్రశ్నించారు. అటు రాజధాని కోసం 16 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు.. పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. సకల జనుల సమ్మెకి దిగారు. రాజధాని 29 గ్రామాల్లో బంద్ పాటిస్తున్నారు. రాజధాని తరలిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read : తక్కువ ధరకే ఎక్కువ ఛానల్స్ : కొత్త టారిఫ్ ప్రకటించిన ట్రాయ్