Atchannaidu: మాతో టచ్ లో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. పాపం ధర్మాన..
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నేనేం అబద్దాలు చెప్పడం లేదు. మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే ఆఫర్లు ఇస్తున్నారు.

Kinjarapu Atchannaidu (Pic: FB)
Kinjarapu Atchannaidu: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. టీడీపీలో చేరేందుకు పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ’40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని నేనేం అబద్దాలు చెప్పడం లేదు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉండడమే కాకుండా ఎదురు మాకే ఆఫర్లు ఇస్తున్నారు. ఒక్కరికి సీటిస్తామనే హామీ ఇస్తే.. నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు.
వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైపోయింది. మాతో టచ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు మెమేందుకు చెప్పాలి? మాతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల జాబితా చెప్పాలని ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేయడం పిచ్చితనమే. మేం టీడీపీలోకి వెళ్లం.. వైసీపీతోనే మా జీవితం అంటూ గంభీరంగా చెప్పే వాళ్లే టీడీపీలో చేరేందుకు ముందు వరుసలో ఉన్నార’ని తెలిపారు.
ధర్మానకు మైండ్ పని చేయడం లేదు
మంత్రి ధర్మాన ప్రసాదరావు(dharmana prasada rao)కు మైండ్ పని చేయడం లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘ధర్మాన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదు. కానీ పార్టీలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు.. ప్రజా వ్యతిరేకతతో ధర్మాన ఇప్పుడు బ్యాలెన్స్ తప్పారు. ధర్మాన మహిళల ముందు మీసాలు మేలేస్తున్నారు, తొడ కొడుతున్నారు. మగాళ్లను దుర్భాషలాడుతూ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ కానిస్టేబుల్ ట్రాన్సఫర్ కూడా చేయించు కోలేకపోతున్నాననే బాధ ధర్మానకు ఉంది. ధర్మాన ఎప్పుడు మంత్రి అయినా ఆయనకు స్వయం ప్రతిపత్తి ఉండేది.. కానీ ఇప్పుడా పరిస్థితి లేద’ని అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు.
Also Read: చంద్రబాబుకి దరిద్రం పట్టుకుంది.. వారాహి బ్యాచ్ కు సిగ్గు లేదా?: అంబటి
అందుకు సీఎం ఒంటిమిట్ట వెళ్లలేదు
హిందువుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా సీఎం వైఎస్ జగన్(YS Jagan) ప్రవర్తించారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ‘శ్రీరామ నవమి రోజున రాముల వారి కళ్యాణోత్సవానికి సీఎం జగన్ వెళ్తారని షెడ్యూల్ ఇచ్చారు.కానీ కాలు బెణికిందనే సాకుతో జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదు. సతీ సమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదు. సీఎం జగన్ తీరుతో హిందువుగా నేను చాలా బాధపడుతున్నాను. జగన్ వేరే మతాన్ని ఆచరించొచ్చు.. కానీ సీఎం హోదాలో ఒంటిమిట్ట వెళ్లాలి కదా? జగ్జీవన్ రాం జయంతి, చిలకలూరి పేట కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్ చక్కగా నడుచుకుంటూ వెళ్లారు, వచ్చార’ని తెలిపారు.
Also Read: పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ ఖరారు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి