Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి

శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురుగు కాల్వ వద్ద పైప్ లైన్ విషయంలో తలెత్తిన చిన్న పాటి వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది.

Srikakulam Crime: మురుగు కాలువ పైప్ గురించి గొడవ: శ్రీకాకుళంలో యువకుడిపై గునపంతో దాడి

Police

Updated On : May 22, 2022 / 9:31 PM IST

Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మురుగు కాల్వ వద్ద పైప్ లైన్ విషయంలో తలెత్తిన చిన్న పాటి వివాదం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈఘటనలో మెట్ట తారకేశ్వరరావు(27) అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రాజగోపాలపురంకు చెందిన మెట్ట తారకేశ్వరరావు (27) ఆదివారం తమ వీధిలోని మురికి కాలువ వద్ద పైప్ లైన్ వేస్తున్నాడు. ఈక్రమంలో అదే వీధిలో ఉంటున్న గొర్లె తులసీరావు..తారకేశ్వరరావుతో గొడవపడ్డాడు.

Other Stories:Cars Collided: అంబులెన్సుకు దారి ఇస్తూ 7 కార్లు ఢీ

ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో ఆగ్రహించిన తులసీరావు..గునపంతో తారకేశ్వరరావు తలపై గట్టిగ కొట్టాడు. దీంతో అక్కడిక్కడే తారకేశ్వర్రావు కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ తారకేశ్వర్రావును స్థానికులు ఆసుపత్రికి తరలించగా..పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న కాశీ బుగ్గ పోలీసులు..ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. గొర్లె తులసీరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Other Stories:Fraud : మహిమ గల నాణెం పేరుతో రూ.11 లక్షలు కాజేసిన కేటుగాళ్లు