ఓ ప్రేమ కధ-3 ఆత్మహత్యలు

newly married couples suicide at visakhapatnam :ఓ ప్రేమకధ కారణంగా ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకన్నఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. విశాఖపట్నం సుందరయ్య కాలనీకి చెందిన నాగిణి అనే మహిళకు పాపారావు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది.నాలుగేళ్ళు సాఫీగా సాగిన వారి కాపురంలో కలతలు వచ్చాయి. గతేడాది నాగిణి, పాపారావు విడిపోయారు. పాపారావు ఉద్యోగరీత్యా అండమాన్ వెళ్లాడు.
భర్తతో విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్న నాగిణికి అభిలాష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అది క్రమేపి ప్రేమగా మారింది. భార్య నుంచి విడిపోయినా భార్య గురించి వాకబు చేస్తూనే ఉన్నపాపారావుకు నాగిణి ప్రేమ వ్యవహారం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం నాగిణి, అభిలాష్ పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చారు.కానీ వీరి ప్రేమ పెళ్లిని పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి బతకలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ వివాహం చేసుకున్న అభిలాష్, నాగిణి