‘చలో అంతర్వేది’ శాంతియుతంగా చేపట్టాలి : పవన్

  • Published By: sreehari ,Published On : September 10, 2020 / 06:55 PM IST
‘చలో అంతర్వేది’ శాంతియుతంగా చేపట్టాలి : పవన్

Updated On : September 10, 2020 / 7:23 PM IST

ఛలో అంతర్వేది కార్యక్రమంలో జనసేన పాల్గొంటుందని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ వెల్లడించారు. అంతర్వేది ఘటనపై ఆయన స్పందించారు. చలో అంతర్వేది కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతియుతంగా పాల్గొనాలని పవన్ జనసైనికులను కోరారు.



దుశ్చర్యలకు కారకులపై చర్యలు తీసుకోవాలని కోరుతుంటే ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మతి స్థిమితం లేని వారి చర్య అని తేలికగా తీసుకోవడం వల్లే వరుస ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.



అంతర్వేది ఘటనలో పోలీసులు నమ్మశక్యం కాని కారణాలు చెబుతున్నారని అన్నారు. భక్తుల మనోభావాలను ప్రభుత్వం కాపాడాలని పవన్ చెప్పారు. అంతర్వేది ఘటనతో ప్రజల మనసులు గాయపడ్డాయని తెలిపారు. దీనిపై ఎవరికైనా నిరసన చేసే హక్కుందన్నారు.



బీజేపీ పిలుపునిచ్చిన ఛలో అంతర్వేది కార్యక్రమానికి జనసేన మద్దతిస్తు న్నట్టుగా పవన్ ప్రకటించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పవిత్ర రథం దగ్ధం ఘటనతో పాటు పిఠాపురం, కొండబిట్రగుంటలో చోటు చేసుకున్న ఘటనలను కూడా పవన్ ప్రస్తావించారు.