సిట్టింగ్‌ సీట్లపై పవన్ కల్యాణ్ వ్యూహం ఇదేనా..!?

అసవరమైతే పిఠాపురంతో పాటు మిగతా 20 నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేయాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు.

సిట్టింగ్‌ సీట్లపై పవన్ కల్యాణ్ వ్యూహం ఇదేనా..!?

Updated On : July 4, 2025 / 8:45 PM IST

పగటి కలలు వద్దు..మళ్లీ మళ్లీ పవర్‌లోకి వచ్చేది కూటమే. రౌడీయిజానికి భయపడేది లేదు. కేసులు పెడతాం, 2029లో వస్తే మీ అంతు చూస్తాం అంటే మీరు రావాలి కదా..మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేమూ చూస్తామంటూ మరోసారి వైసీపీని సవాల్‌ చేశారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్లియర్ కట్ క్లారిటీతో ఉన్నారు సేనాని.

మళ్లీ కూటమిగానే వెళ్తాం..ఇంకో 15, 20 ఏళ్లు తామే అధికారంలో ఉంటాం..సీఎంగా చంద్రబాబే కొనసాగుతారని పలుసార్లు ఓపెన్ స్టేట్‌మెంట్‌ ఇచ్చి టాక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌గా మారారు పవన్. మళ్లీ మళ్లీ కూటమే అంటున్నారు సరే..తాను సీఎం అవుతానని ఎందుకు చెప్పట్లేదంటూ..అపోజిషన్‌ అటాక్‌ చేస్తున్నా..చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారన్న విమర్శలు వచ్చినా ..పవన్‌ తన స్టాండ్ మార్చుకోవడం లేదు. పైగా అస్సులు తగ్గడం లేదు.

కూటమి, చంద్రబాబు భజన చేస్తూ..జనసైనికులను..తన అభిమానులను పవన్..తాకట్టూ పెట్టారని అంటున్నా కూడా..సింగిల్ లైన్ ఎజెండాతో వెళ్తున్నారు పవన్. అదే కూటమి. అయితే పార్టీగా, వ్యక్తిగతంగా కూటమిలో భాగస్వామ్యం అయినా..సొంతంగా తాను బలపడటం కోసం వ్యూహలు రచిస్తూనే ఉన్నారట పవన్. అలా అని ఎక్కడా కూటమిలోని టీడీపీ, బీజేపీని డిస్ట్రబ్ చేయడం లేదు. లోకల్‌గా ఎక్కడైనా సమస్యలు ఉన్నా సెట్‌రైట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read: వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలను, 15 మంది ఎంపీలను గెలిపిస్తాను.. ఒక్క ఎమ్మెల్యే తక్కువ అయినా..: సీఎం రేవంత్

అవసరమైతే సర్ధుకుని పోవాలని కూడా తమ పార్టీ నేతలకు సూచిస్తున్నారు పవన్. జనసేన గెలిచిన 21 సిట్టింగ్‌ సీట్లతో పాటు..పార్టీ బలం బాగా ఉండి..జనసేన సపోర్ట్‌తో టీడీపీ గెలిచిన సీట్లలో కూడా ఎక్కడా ఇబ్బంది రాకుండా..విబేధాలకు చోటు లేకుండా చూస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా జనసేన సిట్టింగ్ స్థానాల్లో టీడీపీ నేతల నుంచి ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

21 సీట్ల విషయంలో పవన్‌కు ఓ ప్లాన్
అయితే ఇప్పుడున్న 21 సీట్ల విషయంలో పవన్‌కు ఓ ప్లాన్ ఉందంటున్నారు. తనతో పాటు పార్టీ మొన్నటి ఎన్నికల్లో గెలిచిన అన్ని సీట్లను తిరిగి నిలబెట్టుకోవాలని వ్యూహం రచిస్తున్నారట. పోటీ చేసిన వందకు వంద శాతం సీట్లను గెలుచుకుని..తన సత్తా ఏంటో తెలియజేసిన పవర్ స్టార్‌..రాబోయే ఎన్నికల్లోనూ కుదిరితే ఇంకో నాలుగైదు సీట్లు ఎక్కువ తీసుకుని..మళ్లీ అన్ని గెలిపించుకోవాలనే స్కెచ్ ఉందంటున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పవన్‌ త్వరలో ప్రత్యేక భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉన్న తీరు..సమస్యలు, అభివృద్ధిపై డిస్కస్ చేయనున్నారట. జనసేన ఎమ్మెల్యేల్లోని చాలా మందిపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారం నేపథ్యంలో పవన్‌ కూడా అలర్ట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో యాక్టీవ్‌గా ఉండేలా చేయడంతో పాటు..ఏ సెగ్మెంట్‌లో ఏ పని పెండింగ్‌లో ఉంది..ప్రజలు కోరుకుంటున్నదేంటి..ప్రభుత్వ పథకాలు, కూటమిలో జనసేన రోల్‌పై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోనున్నారట.

అసవరమైతే పిఠాపురంతో పాటు మిగతా 20 నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేయాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇక ఇంకో పది నియోజకవర్గాల్లో జనసేనకు స్ట్రాంగ్‌ బేస్ ఉందని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమిగా వెళ్తారు కాబట్టి ఆ పదికి పది సీట్లు ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీ ఒప్పుకోకపోతే..కనీసం ఇంకో నాలుగైదు సీట్లైనా తీసుకోవాలని అనుకుంటున్నారట పవన్. తమకు పట్టున్న నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి పనులు చేయడంతో పాటు నియోజకవర్గాల ఇంచార్జ్‌లు పబ్లిక్‌లో ఉండేలా చేయాలని భావిస్తున్నారట. అటు కూటమి విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్న..తన సిట్టింగ్ సీట్లు నిలబెట్టుకోవడంతో పాటు తమకు బలం ఉందనుకున్న స్థానాల్లో కూడా పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారట. సేనాని వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.