Nallapareddy: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై సోదరుడు రాజేంద్ర సంచలన కామెంట్స్
ప్రస్తుతం ప్రసన్న చుట్టూ టీడీపీ కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. కోవూరులో ప్రసన్నకు వ్యతిరేకంగా గాలి వీస్తోందని చెప్పారు.

Kovur MLA Brother Request to CM Jagan
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతున్న వేళ నెల్లూరు జిల్లాలోని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆయన సోదరుడు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. అభ్యర్థి మార్పుపై వైసీపీ అధిష్ఠానం దృష్టి పెట్టాలని అన్నారు.
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ప్రసన్న కుమార్ పక్కనబెట్టారని రాజేంద్ర చెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎన్నికల్లో ప్రసన్నకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దని సీఎం వైఎస్ జగన్‌ను రాజేంద్ర కోరారు. ప్రసన్న కుమార్ కొడుకు రజత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అన్నారు.
ప్రస్తుతం ప్రసన్న చుట్టూ టీడీపీ కోవర్టులు ఉన్నారని ఆయన ఆరోపించారు. కోవూరులో ప్రసన్నకు వ్యతిరేకంగా గాలి వీస్తోందని చెప్పారు. కోవూరులోని మండలాలను కొందరు నాయకులకు పంచి పెట్టారని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో అంతా ఆ నాయకులదే హవా కొనసాగుతోందని అన్నారు.
ప్రసన్న కుమార్‌కు, ప్రజలకు మధ్య అడ్డుగోడలా వారు నిలిచారని రాజేంద్ర చెప్పారు. బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన వెంకట రమణయ్య చాలా ఎక్కువ చేస్తున్నారని తెలిపారు. ప్రసన్న కుమార్ గతంలో చేసిన చేసిన తప్పిదాల వల్ల 2004తో పాటు 2014 ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. ప్రస్తుతం మళ్లీ అవే పరిస్థితులు దాపురించాయని అన్నారు.