చంద్రబాబు పేరు చెప్పగానే మొదట గుర్తుకువచ్చేది ఇదే: సజ్జల

చంద్రబాబు నాయుడు సర్కారు నిధులను పక్కదారి పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు పేరు చెప్పగానే మొదట గుర్తుకువచ్చేది ఇదే: సజ్జల

Sajjala Ramakrishna Reddy

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిని వ్యవస్థీకృతం చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు గుప్పించారు. అమరావతిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల ఈ సందర్భంగా మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడి పేరు చెప్పగానే మొదట గుర్తుకువచ్చేది అవినీతేనని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు సర్కారు నిధులను పక్కదారి పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ, కాంగ్రెస్ దేశంలో కొట్టుకుంటున్నాయని అన్నారు. ఏపీలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ కలిసి చంద్రబాబును సీఎం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయమంటే దోపిడీ అని బాబు నిరూపించారని చెప్పారు.

కాగా, ఏపీలో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోరాడుతోంది.

Also Read: రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత