కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈసీ కీలుబొమ్మ : సీఎం రమేష్

కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. మోడీ చేతిలో విజయసాయిరెడ్డి, జగన్ కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 06:46 AM IST
కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈసీ కీలుబొమ్మ : సీఎం రమేష్

Updated On : April 5, 2019 / 6:46 AM IST

కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. మోడీ చేతిలో విజయసాయిరెడ్డి, జగన్ కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం చేతిలో ఎన్నికల సంఘం కీలుబొమ్మగా మారిందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. మోడీ చేతిలో విజయసాయిరెడ్డి, జగన్ కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు. కేసుల మాఫీ కోసం మోడీకి సపోర్టు చేస్తామని ఓపెన్ గా చెప్పారని తెలిపారు. వారికి మోడీ, అమిత్ షా, ఎలక్షన్ కమిషన్ సూచనలు చేస్తున్నారని.. ఈసీకి విజయసాయిరెడ్డి, జగన్ డైరెక్షన్ ఇస్తున్నారని చెప్పారు. ఏపీ పోలీసు యంత్రాంగం ఈసీ చేతిలో ఉందన్నారు.
Read Also : విప్రోలో పాకిస్తాన్ షేర్లు అమ్మిన కేంద్రం

లోటస్ పాండ్ లో కూర్చొని తనపై కుట్రలు పన్నుతున్నారని సీఎం రమేష్ మండిపడ్డారు. చంద్రబాబుకు వస్తున్న జనాదరణ చూడలేక వైసీపీ, బీజేపీ కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని చెప్పారు. టీడీపీ శ్రేణులను భయాందోళనకు గురి చేయడానికే ఐటీ దాడులు చేస్తున్నారని తెలిపారు.

టీడీపీని ఎదుర్కోలేక దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ కార్యర్తలను ఇబ్బంది పెట్టాలని..అలా చేస్తే భయపడిపోతారని దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎన్ని అరాచకాలు చేసినా భయపడేదిలేదని స్పష్టం చేశారు.  
Read Also : ఎన్నికల తర్వాత మోడీ జైలుకు: రాహుల్ గాంధీ