ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు..

ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు..

Updated On : February 17, 2021 / 4:35 PM IST

CM KCR’s birthday celebrations : ఏపీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. విశాఖ అచ్యుతాపురంలో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

మరోవైపు కేసీఆర్‌ అభిమాని చందు అనే వ్యక్తి పలు సేవా కార్యక్రమాలకు కూడా చేపట్టారు. విశాఖలో సీఎం జగన్‌ పర్యటనలో ఉండగానే ఈ వేడుకలు జరగడం సీఎం సభా ప్రాంగణంలో చర్చనీయాంశంగా మారింది.

ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆధ్వర్యంలో చేపట్టిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజ‌య‌వంత‌ంగా జరిగింది.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభ తరుణాన తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 దేశాల్లో కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా చరిత్రలో నిలిచిపోయారు కేసీఆర్. తెలంగాణ అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లుగా మారింది.