తగ్గేదేలే.. కచ్చితంగా పోటీ చేస్తా, గెలిచి తీరతా- ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ నాయకుడి కోసమే నిలబడ్డా. ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. పార్టీని గెలిపించుకోవడానికి చంద్రబాబు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.

తగ్గేదేలే.. కచ్చితంగా పోటీ చేస్తా, గెలిచి తీరతా- ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు

Kesineni Nani On Contest In Elections

Updated On : January 5, 2024 / 9:34 PM IST

Kesineni Nani : టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను అన్నారు. తిరువూరు సభకు నన్ను రావొద్దన్నారు, నేను వెళ్లడం లేదు అని తెలిపారాయన. అధినేత చెప్పిన మాటను రామభక్త హనుమలాగా శిరసావహిస్తాను అని స్పష్టం చేశారు. నా మైండ్ సెట్ అభిమానులందరికీ తెలుసు, అభిమానుల మైండ్ సెట్ నాకు తెలుసు అని నాని అన్నారు. నేను టీడీపీ పార్టీకి ఓనర్ ను కాదన్న కేశినేని నాని చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు అన్నీ చెబుతా అని హాట్ కామెంట్స్ చేశారు. తినబోతూ రుచులెందుకు అని వ్యాఖ్యానించారు.

ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో ప్రజలు నిర్ణయిస్తారు. నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. అందరి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటా. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధినేత ముగ్గురు పెద్ద మనుషులతో చెప్పించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ నాయకుడి కోసమే నిలబడ్డా. ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. పార్టీని గెలిపించుకోవడానికి చంద్రబాబు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. పార్టీ అధినేత నిర్ణయాన్ని నేను తప్పుపట్టడం లేదు. పార్టీ పంపించిన ముగ్గురు పెద్ద మనుషులు చెప్పిందే నేను పోస్టులో పెట్టా.

Also Read : వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా, ఇండిపెండెంట్‌గా పోటీ

నా దగ్గరికి ఆ ముగ్గురు వచ్చిపుడు మరో ముగ్గురు సాక్షులు కూడా వచ్చారు. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసైనా గెలుస్తా. ఆ విషయంలో సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో నేను విజయవాడ నుంచే పోటీ చేస్తా. కచ్చితంగా మూడవసారి గెలుస్తా. వసంత కృష్ణప్రసాద్, నేను మంచి స్నేహితులం. అలాగని కొండపల్లి ఎన్నికల్లో మేం కలిసి పని చేయలేదు కదా? ” అని కేశినేని నాని అన్నారు.

Also Read : ఎన్నికల వేళ షాక్.. టీడీపీకి కేశినేని నాని గుడ్ బై?