ysrcp: పార్టీని అధికారంలోకి తేవాలి: ధర్మాన

పార్టీకి పరీక్షాకాలంలాంటి ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్.

ysrcp: పార్టీని అధికారంలోకి తేవాలి: ధర్మాన

Dharaman Krishna Das

Updated On : April 23, 2022 / 3:29 PM IST

ysrcp: పార్టీకి పరీక్షాకాలంలాంటి ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్. ఈ పదవి చేపట్టిన తర్వాత శనివారం జరిగిన ఒక సమావేశంలో ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు జిల్లా బాధ్యతలు అప్పగించిన సీఎం వై.ఎస్.జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ‘‘జిల్లాలో వైసీపీ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలి. జిల్లాలోని పార్లమెంట్ స్థానంతోపాటు ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ దక్కించుకోవాలి. ప్రతి ఓటూ దక్కేలా ప్రయత్నించాలి. కార్యకర్తలలో అసమ్మతి ఉంది. దీనికి కారణం అవినితి రహితపాలన అందించడమే.

YSRCP MPs On Development : సింగపూర్‌లా ఏపీ రాజధాని కట్టాలంటే రూ.2లక్షల కోట్లు కావాలి- వైసీపీ ఎంపీలు

ఎవరైనా డబ్బు, పేరుకొసం రాజకీయాల్లొకి వస్తారు. కానీ, జగన్.. డబ్బు, పేరు రెండూ ఉన్నా రాజకియాల్లోకి వచ్చారు. కార్యకర్తల కష్టంతోనే 151 స్దానాలలో గెలుపొందాం. గతంలో కార్యకర్తలకు జరిగిన ఇబ్బందులు భవిష్యత్‌లో ఉండవు‌’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీపై కూడా విమర్శలు చేశారు. గతంలో పార్టీనే లేదు అన్న అచ్చెంనాయుడు 161 స్దానాలు గెలుస్తామంటున్నాడని, పార్టీలో మనోస్థైర్యం పెంచేందుకే ఆ వ్యాఖ్యలు చేశారంటూ ధర్మాన విమర్శించాడు.