Anil Kumar Yadav : మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకపోతే 70ఏళ్లు వెనక్కి వెళతారు- అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav Hot Comments : గొర్రెలు కాసిన వాళ్ళ కష్టంతో చంద్రబాబు కుటుంబం వేల కోట్లకు పడగలెత్తిందని ఆరోపించారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని ధ్వజమెత్తారు.

Anil Kumar Yadav : మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకపోతే 70ఏళ్లు వెనక్కి వెళతారు- అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav Hot Comments (Photo : Facebook)

Updated On : November 15, 2023 / 9:16 PM IST

ఏపీలో రాజకీయాలు హీట్ ఎక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ, చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ నేతలు అలీ, అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీకి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నాలుగు దిక్కులు అన్నారు అలీ. నాకు ఎన్టీఆర్ అంటే అభిమానం అని చెపిన ఆయన.. టీడీపీలో తనను కరివేపాకులా వాడుకున్నారని ఆరోపించారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే సీఎం జగన్ లక్ష్యం అని చెప్పారు. పేదల గృహాల కోసం ప్రభుత్వానికి తన సొంత భూమిని ఇచ్చానని తెలిపారు అలీ.

Also Read : చంద్రబాబుకు గుండె సమస్య, 5 వారాల రెస్ట్ అవసరం.. హైకోర్టుకు హెల్త్ రిపోర్టు అందజేత

వైసీపీలో 50మంది ఫైర్ బ్రాండ్ నాయకులు ఉన్నారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులకు వైసీపీలో గౌరవం దక్కిందన్నారు. గొర్రెలు కాసిన వాళ్ళ కష్టంతో చంద్రబాబు కుటుంబం వేల కోట్లకు పడగలెత్తిందని ఆరోపించారు. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారని అనిల్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. తండ్రి జైల్లో ఉంటే ఢిల్లీ పారిపోయిన ఘనుడు లోకేశ్ అంటూ విమర్శించారు. రకరకాల హామీలతో ప్రజలను మోసం చేసేందుకు కట్టకట్టుకొని నాయకులు వస్తారని కామెంట్ చేశారు.

Also Read : టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి 14 రోజులు రిమాండ్.. కడప సెంట్రల్ జైలుకు తరలింపు

వచ్చే ఎన్నికలు యుద్ధ వాతావరణంలో జరగనున్నాయని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాకపోతే పేదలు 70 ఏళ్ళు వెనక్కి వెళతారని హెచ్చరించారు. కంటి ఆపరేషన్ కోసం చంద్రబాబుకి కోర్టు బెయిల్ ఇస్తే న్యాయం గెలిచింది అంటూ ఊదరగొడుతున్నారని టీడీపీ నేతలపై మండిపడ్డారు అనిల్ కుమార్ యాదవ్.