YSRCP: పవన్ వల్ల సభ్యసమాజంలో అలజడి చెలరేగుతోంది: వైసీపీ లీగల్ సెల్

వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

YSRCP: పవన్ వల్ల సభ్యసమాజంలో అలజడి చెలరేగుతోంది: వైసీపీ లీగల్ సెల్

Pawan Kalyan

Updated On : July 12, 2023 / 3:04 PM IST

YSRCP – Legal Cell: వాలంటీర్లను ఉద్దేశించి జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై వైసీపీ లీగల్ సెల్ విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వాలంటీర్లతో కలిసి ఆ కార్యాలయానికి వెళ్లి న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.

అనంతరం పవన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆయనపై మండిపడ్డారు. న్యాయవాదులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే కుట్రతోనే పవన్ కల్యాణ్ అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో సభ్యసమాజంలో అలజడి చెలరేగుతోందని చెప్పుకొచ్చారు.

వాలంటీర్లకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ లేకపోతే కరోనా సమయంలో ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవారని చెప్పారు. విమెన్ ట్రాఫికింగ్ గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోవద్దని అన్నారు. వాలంటీర్లు మనోధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు.

Eatala Rajender: ప్రపంచంలో ఇలాంటి పదవి అంటూ ఒకటి ఉంటుందా.. ఈటలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టాస్క్ ఏంటి?