Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి స్త్రీ వలన కలహములు కలుగును.!
ఈ రోజు (గురువారం, అక్టోబర్ 3, 2024న) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి రా.తె 2:58, హస్త మ 3:32 గురువారం
మేష రాశి: కుటుంబ జీవితంలో సుఖము, శరీర ఆరోగ్యము, ధన లాభము, కీర్తి, సంతోషము, స్త్రీ సౌఖ్యము, పరోపకార్యములు చేయడము: శివారాధన
వృషభ రాశి: శారీరక రుగ్మతలు, అనారోగ్యం, మానసిక ఆవేదన మనోభారం, ప్రయత్న కార్యములు చెడిపోవుట, సోమరితనం, భయము, మనస్థాపము: అమ్మవారి ఆరాధన
మిథున రాశి: మంచి ఉద్యోగం లభించడం, నూతన వ్యాపారములు, ప్రయాణములు, బంధుమిత్ర విరోధము, హృదయ ఆందోళన, ప్రయత్న కార్యములు, స్థాన చలనము, నీచ స్త్రీ మూలానా కలహములు: సుబ్రహ్మణ్య ఆరాధన
కర్కాటక రాశి: ధనలాభము, నూతన వస్త్ర లాభములు, మనోధైర్యము, ఇష్ట స్త్రీ సంగమం, అన్నదమ్ములతో అనుకూలము, కుటుంబంలోనూ, చేయు వృత్తుల యందు సుఖశాంతులు పొందుతారు : గణపతి ఆరాధన
సింహ రాశి: ధన విషయంలో చికాకులు, నమ్మిన వారి వలన మోసము, మనోవిచారము, రోగ బాధలు, స్త్రీమూలకంగా, తల్లి మూలకంగా ఇబ్బందులు, రుచించని భోజనములు: శివ ఆరాధన
కన్యా రాశి: శారీరక సౌఖ్యము, వ్యాపారములో లాభము ఆరోగ్యము, సంతోషము, ఉత్సాహము, అభివృద్ధి, సన్మానములు, ఉద్యోగలాభం. నూతన వ్యాపారములు: వేంకటేశ్వర స్వామి ఆరాధన
తులా రాశి: బంధు, పుత్ర మిత్రులతో మాటపట్టింపులు, సోమరితనం, ప్రయాణంలో అలసట, ఆగౌరము, శరీరశ్రమ, బదిలీలు, ధనవ్యయం, ఇబ్బందికరమైన సంఘటనలు కలుగును: విష్ణువు ఆరాధన
వృశ్చిక రాశి: నిరుద్యోగులకు ఉద్యోగలాభం, సుఖభోజనము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, బంధు మిత్రులతో విందు వినోదములు, శుభవార్తలు, ప్రభుత్వ సహాయం: గణపతి ఆరాధన
ధనస్సు రాశి: ప్రయత్న కార్యములందు జయము, ఆరోగ్యము, ఇష్టకార్యసిద్ధి, నూతన వ్యక్తుల పరిచయం, విలువైన ఆభరణములు కొనుగోలు, బంధు మిత్రులతో గౌరవం పొందడం: రాజ రాజేశ్వరి అమ్మవారి ఆరాధన
మకర రాశి: కుటుంబ కలహములు, భయము, అనారోగ్యము, ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం, అనారోగ్యము, ఆటంకములు: ఆంజనేయస్వామి ఆరాధన
కుంభ రాశి: అజీర్ణ బాధలు, సంతానముతో విరోధము, ధనలాభం, వ్యాపారాలలో లాభము, ప్రయాణముల వలన ధనము రావడం, భయము, స్థానచలనము: నవగ్రహ ప్రదక్షిణలు
మీనా రాశి: గౌరవము, స్త్రీ సుఖము, శరీర సౌఖ్యము, ధనలాభం, కుటుంబములో భార్యబిడ్డల మూలకంగా సుఖశాంతులు కలుగును, అన్ని పనులు విజయవంతం కావడం, వ్యాపారంలో లాభములు: వేంకటేశ్వర స్వామి వారి ఆరాధన
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956