Karthika Masam: కార్తీక మాసం 5వ రోజు… చేయాల్సిన పూజలు, దానాలు, పాటించాల్సిన నియమాలు..

కార్తీక మాసం 5వ రోజున వీటిని దానం ఇవ్వడం వల్ల వంశం వృద్ధి చెందుతుంది. దుంప నాశనం జరగదు. వంశానికి నాశనం జరగదు.

Karthika Masam: కార్తీక మాసం 5వ రోజు… చేయాల్సిన పూజలు, దానాలు, పాటించాల్సిన నియమాలు..

Updated On : October 26, 2025 / 1:20 AM IST

Karthika Masam: కార్తీక మాసం 5వ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం. కార్తీక మాసంలో 5వ రోజు.. కార్తీక శుక్ల పంచమి.. దీన్నే నాగపంచమి, జ్ఞాన పంచమి అనే పేర్లతోనూ పిలుస్తారు. అక్టోబర్ 26 ఆదివారం కార్తీక శుక్ల పంచమి. పంచమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారిని పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అంటూ కీర్తిస్తాం.

కార్తీక శుక్ల పంచమి రోజు జ్ఞాన పంచమి, నాగపంచమి. అక్టోబర్ 26న అమ్మవారిని, అయ్యవారిని కలిపి పూజించాలి. అంటే శివపార్వతులు, లక్ష్మీనారాయణులు.. ఇలా దంపత సమేతంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసం 5వ రోజు పూలు, పండ్లు, జలం, వస్త్రదానం, అన్నదానం చేసినా జన్మజన్మల దరిద్రాలు వదిలిపోతాయి.

అన్నింటికంటే గొప్పదానం కార్తీక మాసంలో 5వ రోజు దుంపల దానం. కంద, పెండలం అనే దుంపలను కార్తీక మాసంలో 5వ రోజు దానం చేస్తే వారి వంశం వృద్ధి చెందుతుంది. జీవితంలో అభివృద్ధి సాధించాలంటే ఈ దుంపలు దానం ఇవ్వాలి. కార్తీక మాసం 5వ రోజున దుంపలు దానం ఇవ్వడం వల్ల వంశం వృద్ధి చెందుతుంది. దుంప నాశనం జరగదు. వంశానికి నాశనం జరగదు.

కంద కానీ పెండలం కానీ లేదా రెండూ కలిపి అయినా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా చేస్తే మీ వంశం అభివృద్ధి చెందుతుంది. మీ పిల్లలు కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరతారు. కార్తీక మాసం 5వ రోజు ఆవుపాలతో శివాభిషేకం చేయాలి. కొన్ని కోట్ల యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది.