Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నేడు శ్రమకు తగిన గుర్తింపు ఉండదు..!

ఈ రోజు (2024, అక్టోబర్ 19 శనివారం) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నేడు శ్రమకు తగిన గుర్తింపు ఉండదు..!

Updated On : October 18, 2024 / 7:35 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధినామసంవత్సర ఆశ్వీజ బహుళ విదియ: ఉ. 9:45. భరణి: ఉ.10:46 శనివారము ద్వాదశ రాశుల ఫలితములు

మేష రాశి: అధికంగా శ్రమ చేయడం, శ్రమకు తగిన గుర్తింపు లేకపోవడం, ఆదాయానికి మించిన ఖర్చులు, అపార్థములు, అవమానములు, శుభకార్య నిర్వాహణ, ప్రయాణముల వలన లాభము కలుగుతాయి, కోర్టు సమస్యలు కలుగుతాయి. కార్తవీర్యాంజున స్తోత్ర పారాయణం చేసినచో ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: సంఘంలో అగౌరవం, శారీరక శ్రమ, మనో వికలత్వం, శత్రువృద్ధి, కార్యనాశనము, కొన్ని విషయాలలో అధైర్యము పెరుగును, గృహములు ముఖ్యమైన మార్పులు. లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభపలితాలు కలుగుతాయి.

మిధున రాశి: శుభవార్త శ్రవణం, విందు భోజనము, కార్యసిద్ధి, ధన లాభము. సద్గోష్టి, సోమరితనం తగ్గుతుంది. ఆవేశం నియంత్రణలో ఉండును, ఆప్త మిత్రులకు అండదండలు లభించును, ఆకస్మిక ధనలాభము, దూర ప్రయాణములు, శుభ కార్యములు ఫలిస్తాయి. దత్తాత్రేయ స్వామి స్తోత్ర పారాయణం చేయవలెను.

కర్కాటక రాశి: చేపట్టిన ప్రతిపనిలో సానుకూలత, అభీష్టసిద్ధి, ఆరోగ్యం, శుభకార్య నిర్వహణ, సుఖసంతోషాలు, నూతన అగ్రిమెంట్లు, రుణబాధలు తగ్గుతాయి, ప్రమోషన్లు, స్థాన చలనం. ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

సింహ రాశి: స్థానచలనం, కార్యరంగంలో ప్రతికూలత, శత్రు వృద్ధి, బంధు మిత్ర, పుత్ర విరోధము, కుటుంబ సమస్యలు, చేదు అనుభవాలు ఎదురు అవుతాయి, విమర్శలు ఎదుర్కొంటారు. ఆవేశం ఎక్కువ అవుతుంది, సంకటాలు కలుగుతాయి. శివ ఆరాధన చేయవలెను. ఆరాధన చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి: అజీర్ణ బాధ, నరాల బలహీనత, ధన నాశనము, నిద్రలేమి, అకారణ వైరము జీర్ణకోశ సమస్యలు, స్థిర ఆదాయం తగ్గును, కోర్టు సమస్యలు, అనారోగ్యము, విమర్శలు, కుటుంబంలో కలతలు, నూతన పరిచయాలను తగ్గిస్తారు. రుణ బాధలు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి.

తుల రాశి: రోగభయము, ఉద్యోగంలో అనుకూలత, అకాల భోజనములు కలుగును, నమ్మినవారివలన మోసపోవడం, స్త్రీ మూలకంగా చికాకులు, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రతి పనిలో విజయం, రహస్యములు దాచటం, ప్రమాణములలో ఆటంకములు. దేవీస్తోత్ర పారాయణం చేసినచో ఉత్తమై మన ఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి: బంధువులతో విందులు, వినోదమలు విలువైన వస్త్రములు కొనుగోలు చేయడం, ధనవృత్తి విషయంలో అభివృద్ది కలగడం, ఆనందమగా కాలము గడుపుతారు, వ్యాపారంలో మంచి లాభములు, మానసికవేదనలు. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆరాధనం వల్ల శుభం కలుగుతుంది

ధనస్సు రాశి: ప్రయణంలో ప్రయాసలు పలుగుట, వివాహాది శుభకార్యక్రమములకు ఆటంకములుకలుగును, పై అధికారాలతో మాటలు పదవలసి వచ్చును, బంధు, పుత్ర, మిత్రులతో మాటామాట పట్టింపులు కలుగును, మనస్సు ఇబ్బందికరమైన సంఘటన కలుగును. దత్తకవచ పారాయణం చేయవలెను, శుభం జరుగును.

మకర రాశి: విందు వినోదములు, లాభదాయకమైన ప్రయాణములు, సహాయ సహకారములు, వృత్తి ఉద్యోగములందు ఉహించని లాభములు. ఇష్టులైన వారితో అనుభవజ్ఞులతో సలహా సంప్రదింపులు చేస్తారు. శివారాధన వలన మేలు జరుగుతుంది.

కుంభ రాశి: తలచిన ప్రతి పనికార్యము దాల్చును, గొప్ప వ్యక్తులు, నూతన వ్యక్తులతో పరిచయములు కలుగును, ఫ్యాన్సీ, వెండి, బంగారు, నగలు, విలువైన దుస్తులు కొనుగోలు చేస్తారు, చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారములలో అభివృద్ధి, రాణింపు ఉంటుంది.
శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధనవలన మంచి జరుగుతుంది.

మీన రాశి: స్థానచలనం, పేరు ప్రఖ్యాతలు కలగడం, అన్నింటా విజయములు, వృత్తి, ఉద్యోగములలో అభివృద్ధి, రుణబాధలు తగ్గుతాయి, పిల్లల మాట, భార్య మాట వింటారు. మధుర భోజనములు చేస్తారు. ధనలాభం, గౌరవ సన్మానములు పొందుతారు
శ్రీ వేంకటేశ్వ స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956