ఏపీ, తెలంగాణలో Airtel Wi-Fi కాలింగ్ సర్వీసు

ప్రముఖ టెలికం నెట్‌వర్క్ ఎయిర్ టెల్ వాయిస్ ఓవర్ వైఫై సర్వీసు లాంచ్ చేసింది. ఈ సర్వీసును డిసెంబర్ నెలలో ఢిల్లీ NCR సర్కిల్ మాత్రమే తొలుత ఆరంభించగా.. ఇప్పుడు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కూడా ఎయిర్ టెల్ వైఫై వాయిస్ కాల్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎయిర్ టెల్ Wi-Fi కాలింగ్ సర్వీసును తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ముంబై, కోల్ కతాలో కూడా ప్రవేశపెట్టింది. ఈ సర్వీసు ద్వారా ఎయిర్ టెల్ స్మార్ట్ ఫోన్ కస్టమర్లు ఏదైనా నెట్ వర్క్ కు ఈజీగా వైఫై కాల్ మాట్లాడుకోవచ్చు. ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ చేయడానికి అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ అప్లికేషన్ తక్కువ మొత్తంలో మాత్రమే డేటాను వినియోగిస్తుంది. VoWiFi క్యాపబులిటీపై కస్టమర్ల ఆసక్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఎయిర్ టెల్ ఈ వైఫై సర్వీసు అందించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్ టెల్ కస్టమర్లకు తొలుత ఈ VoWiFi ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుచ్చినట్టు ఏపీ, తెలంగాణకు భారతీ ఎయిర్ టెల్ సీఈఓ అయిన అన్వీత్ సింగ్ పూరి ఒక ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే కస్టమర్లంతా వైఫై సర్వీసును వ్యాలిడేట్ చేయించుకోవడం ఎంతో ముఖ్యమైనదిగా ఆయన తెలిపారు.
Wi-Fi (VoWiFI) ఎలా పనిచేస్తుందంటే? :
ఎయిర్ టెల్ Wi-Fi కాలింగ్ సర్వీసుకు ఎలాంటి App అక్కర్లేదు. మీ స్మార్ట్ ఫోన్లలోని కొన్నింటిని కాన్ఫిగర్ చేసుకుంటే సరిపోతుంది. అదేంటో ఓసారి చూద్దాం… ప్రస్తుతం.. ఈ సర్వీసు Compatibleతో రన్ అయ్యే Airtel Xstream Fiber Home బ్రాడ్ బ్యాండ్‌లో మాత్రమే పనిచేస్తుంది. అతి త్వరలో Compatibleతో రన్ అయ్యే అన్ని బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు, Wi-Fi Hotspotsలో కూడా ఈ ఫీచర్ సపోర్ట్ చేయనుంది.
* ఎయిర్ టెల్ కస్టమర్లు.. మీ స్మార్ట్ ఫోన్ కంపాటబులిటీని www.airtel.in/wifi-calling చెక్ చేసుకోండి.
* మీరు వాడే స్మార్ట్ ఫోన్ compatible అయితే యూజర్లు Device OSను Upgrade చేసుకోవాల్సి ఉంటుంది.
* స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటెస్ట్ వెర్షన్ మాత్రమే Wi-Fi కాలింగ్ సపోర్ట్ చేస్తుంది.
* మీ స్మార్ట్ ఫోన్ Settings నుంచి Wi-Fi కాలింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.
ఏయే స్మార్ట్ ఫోన్లలో సపోర్ట్ చేస్తుందంటే?:
ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, షియోమీ వంటి అన్ని మోడల్ ఐఫోన్లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది.
- Apple: iPhone XR, iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus, iPhone SE, iPhone 8, iPhone 8 Plus, iPhone X, iPhone XS, iPhone XS Max, iPhone 11, iPhone 11 Pro
- OnePlus: OnePlus 7, OnePlus 7 Pro, OnePlus 7T, OnePlus 7T Pro, OnePlus 6, OnePlus 6T
- Samsung: Samsung Galaxy J6, Samsung Galaxy On 6, Samsung Galaxy M30s, Samsung Galaxy A10s, Samsung Galaxy M20, Samsung Galaxy S10, Samsung Galaxy S10+, Samsung Galaxy S10e
- Xiaomi: Poco F1, Redmi K20, Redmi K20 Pro