చైనా కరోనాపై దుష్ర్పచారం చేసిందా? లాక్ డౌన్‌లో ప్రపంచాన్ని ఇరికించిందా? బయటకొస్తున్న సంచలన నిజాలివే!

  • Published By: sreehari ,Published On : September 27, 2020 / 08:18 PM IST
చైనా కరోనాపై దుష్ర్పచారం చేసిందా? లాక్ డౌన్‌లో ప్రపంచాన్ని ఇరికించిందా? బయటకొస్తున్న సంచలన నిజాలివే!

Updated On : September 28, 2020 / 5:29 PM IST

China Disinformation campaign to force world economy into lockdown : ప్రపంచాన్ని పట్టిపీడుస్తోన్న కరోనావైరస్ మహమ్మారి… చైనా పన్నాగమేననే వాదన ప్రపంచ దేశాల్లో వినిపిస్తోంది.. ప్రపంచంపై ఆధిపత్యం కోసమే డ్రాగన్ ఇలాంటి దారుణానికి ఒడిగట్టిందనే సందేహాలు, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. కరోనా వైరస్ మొట్టమొదటిసారిగా ఉద్భవించిన చైనా వుహాన్ సిటీలో డ్రాగన్ షట్ డౌన్ చేసింది.. ఆపై చైనా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లు విధిస్తూ కరోనా నియంత్రణ అంటూ కలరింగ్ ఇచ్చింది..



కరోనా నియంత్రణకు లాక్ డౌన్ లు ఒక్కటే శరణ్యమంటూ ఇతర దేశాలను ప్రోత్సహించింది.. లాక్ డౌన్లంటూ ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించింది డ్రాగన్.. ఇదంతా చైనా ప్రాపగాండాగానే చెప్పొచ్చు. ఆ కుట్రలో భాగంగానే డ్రాగన్ సోషల్ మీడియాను ఆయుధంగా ప్రయోగించి.. వైరస్ గురించి  విస్తృతంగా దుష్ర్పచారం చేసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను లాక్ డౌన్‌లో ఇరికించింది.
disinformation campaign to force world economy into lockdownలాక్ డౌన్లను ప్రపంచ దేశాలు ప్రోత్సహించేలా :
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసేందుకే చైనా కమ్యూనిస్ట్ పార్టీ.. వైరస్‌పై దుష్ర్పచారం వ్యాప్తి చేసేందుకు సోషల్ మీడియాను తమ ప్రధాన అస్త్రంగా ప్రయోగించి ఉంటుందని అమెరికన్ లాయర్ Michael Senger సంచలన నిజాలను బయటపెట్టారు. సోషల్ మీడియాలో వేలాది ట్వీట్లను ప్రస్తావిస్తూ… చెైనా తొలుత అవలంభించిన క్రూరమైన నిబంధనలే ఇతర ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించేలా చేసిందని అభిప్రాయపడ్డారు.



కరోనా మహమ్మారి ప్రారంభంలో హార్డ్ ఇమ్యూనిటీకే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రాధాన్యాత ఇచ్చారని, కానీ, డ్రాగన్ తప్పుడు సమాచారంతో జాన్సన్ కూడా బ్రిటన్ లాక్ డౌన్ ప్రేరణ చెందారని Senger పేర్కొన్నారు. ఇదంతా చైనా పనే అంటూ Senger ఆరోపించారు.

disinformation campaign to force world economy into lockdown

Tablet Magazine లో వచ్చిన China’s Global Lockdown Propaganda Campaign కథనంలో అట్లాంటాలోని జార్జియాకు చెందిన లాయర్ Michael Senger తన సిద్ధాంతాన్ని బయటపెట్టారు.

disinformation campaign to force world economy into lockdown

చైనా లాక్‌డౌన్ ఎత్తేసి.. ప్రపంచ దేశాలను ఇరికించింది :
లాక్ డౌన్లు అనేవి సైన్స్ పరంగా వైరస్‌ను కట్టడి చేయలేవని అన్నారు.. అంతేకాదు.. చైనీస్ నేత జిన్ పింగ్ ప్రయోగించిన క్రూరమైన విధానాల ఆధారంగానే ఈ లాక్ డౌన్ అనేది తెరపైకి వచ్చిందని వాదించారు. వైరస్ నుంచి చైనా కోలుకుంటున్న సమయంలో బ్రిటన్ లాంటి అనేక దేశాలు కరోనా నిబంధనలతో లాక్ డౌన్ లో ఉండిపోయాయిని గుర్తు చేశారు. అప్పటికే వుహాన్ కూడా సాధారణ స్థితిలోకి వచ్చేందని Senger పేర్కొన్నారు.



ప్రపంచ దేశాల్లో చైనా లాక్ డౌన్ విధానాలను ముందుగా అమలు పరిచింది ఇటలీనే.. అక్కడే వైరస్ ప్రభావం అత్యంత ప్రాణాంతకంగా మారిందన్నారు. ట్విట్టర్ సోషల్ మీడియాలో వేలాది ఫేక్ అకౌంట్ల నుంచి వచ్చిన కరోనా వైరస్ తప్పుడు సందేశాలను డిలీట్ చేసిందని Senger చెప్పారు.

disinformation campaign to force world economy into lockdown

గత జూన్ నెలలో 23,750 ట్విట్టర్ అకౌంట్లలో తప్పుడు సమాచారాన్ని గుర్తించినట్టు ట్విట్టర్ ధ్రువీకరించింది. 1,50వేల వరకు విస్తరించినట్టు పేర్కొంది. వెంటనే ఆయా ఫేక్ అకౌంట్లను ట్విట్టర్ డిలీట్ చేసినట్టు సోషల్ మీడియా దిగ్గజం ప్రకటించింది.