Gold Rate : హమ్మయ్య..! రెండ్రోజుల్లో రూ.2వేలకుపైగా తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : హమ్మయ్య..! రెండ్రోజుల్లో రూ.2వేలకుపైగా తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరల వివరాలు ఇలా..

Gold And Silver Price

Gold Rate in Hyderabad : వారంరోజుల క్రితం వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం ధరకు బ్రేక్ పడింది. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత శనివారం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఆదివారం స్థిరంగా కొనసాగింది. సోమవారం మరోసారి బంగారం ధర తగ్గగా.. మంగళవారంసైతం బంగారం ధర తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1530 తగ్గింది. దీంతో గడిచిన నాలుగు రోజుల్లో 10గ్రాముల గోల్డ్ పై రూ. 2,200కుపైగా తగ్గింది. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్లతో బెంబేలెత్తిపోయిన బంగారం కొనుగోలుదారులకు ప్రస్తుతం తగ్గుతున్న ధరలతో కాస్త ఊరట లభించినట్లయింది. మరోవైపు వెండి ధరసైతం తగ్గింది. ఇవాళ కిలో వెండిపై రూ. 2,500 తగ్గింది. దీంతో రెండు రోజుల్లో కిలో వెండిపై రూ. 3,500 తగ్గుదల చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,160 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,310.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,150 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,160.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,000 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,100.

భారీగా తగ్గిన వెండి ధర ..
దేశ వ్యాప్తంగా వెండి ధర భారీగా తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.86,500 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 86,500. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.83,000 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.100 మాత్రమే తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 85,900 వద్ద కొనసాగుతుంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.