Gold Rate : ఊరించి ఉసూరుమనిపించి..! మళ్లీ పసిడి ప్రియులకు షాకిచ్చిన బంగారం ధర

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : ఊరించి ఉసూరుమనిపించి..! మళ్లీ పసిడి ప్రియులకు షాకిచ్చిన బంగారం ధర

Gold

Gold And Silver Price : ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు గత నాలుగు రోజులుగా బ్రేక్ పడింది. నాలుగు రోజుల్లో 24 క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,200కుపైగా తగ్గింది. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్లతో బెంబేలెత్తిపోయిన కొనుగోలుదారులకు తగ్గిన ధరలతో కాస్త ఊరట లభించినట్లయింది. దీనికితోడు రాబోయేరోజుల్లో గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొనడంతో బంగారం కొనుగోళ్లకు సిద్ధమయ్యారు. అయితే, ఊరించి ఉసూరుమనిపించినట్లుగా.. బంగారం ధర మళ్లీ పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ.490 పెరిగింది. మరోవైపు.. వెండి ధర వరుసగా మూడోరోజు తగ్గింది. బుధవారం కిలో వెండిపై రూ. 100 తగ్గింది.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,600 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,650 వద్దకు చేరింది.

 

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,800.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.66,600 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,650.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,300 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.73,420.

 

  • తగ్గిన వెండి ధర ..
    దేశ వ్యాప్తంగా వెండి ధర తగ్గింది. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.86,400 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 86,400. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.82,900 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3,400 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 82,500 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.