స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో Xiaomi నెం.1 : టాప్ 10లో Apple 

  • Published By: sreehari ,Published On : November 15, 2019 / 09:59 AM IST
స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో Xiaomi నెం.1 : టాప్ 10లో Apple 

Updated On : November 15, 2019 / 9:59 AM IST

ఇండియాలో మొబైల్ హ్యాండ్ సెట్ ఇండస్ట్రీ నెమ్మదించినట్టు నివేదికలు వస్తున్న తరుణంలో వృద్ధిరేటు క్రమంగా పెరుగుతూ పోతోంది. ఏడాది నుంచి ఏడాదికి 8శాతం మేర పెరిగినట్టు నివేదికలు సూచిస్తున్నాయి. లేటెస్ట్ సీఎంఆర్ ఇండియా మొబైల్ హ్యాండ్ సెట్ మార్కెట్ రివ్యూ రిపోర్టు ప్రకారం.. 2019 మూడో త్రైమాసికంలో రూ.7వేల కంటే ధర తక్కువ ఉన్న స్మార్ట్ ఫోన్ల మార్కెట్ షేర్ 25శాతం మేర తగ్గింది.మరోవైపు మధ్యస్థ కేటగిరీ ధర రూ.7వేల నుంచి రూ.25వేలు మధ్య 20శాతం పెరిగింది.

ప్రీమియం స్మార్ట్ ఫోన్ సిగ్మెంట్ 101శాతంతో రూ.25వేల మేర పెరిగింది. ఈ క్రమంలో చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ అగ్రస్థానంలో నిలిచింది. సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ రెండో స్థానంలో నిలవగా తర్వాతి స్థానాల్లో వివో, రియల్ మి, ఒప్పో నిలిచాయి.

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ మాత్రం టాప్ 10 ర్యాంకు జాబితాలో మరోసారి తన 10వ ర్యాంకును పదిలం చేసుకుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? టాప్ ఐదు వెండర్లు ప్రతి తొమ్మిది స్మార్ట్ ఫోన్లను రవాణా చేసే ఎనిమిది వెండర్లు ఇండియాలో నుంచే షిప్పింగ్ చేయడం విశేషం.

ఒక ఏడాదిలో షియోమీ వృద్ధి 2శాతానికి తగ్గిపోయినప్పటికీ స్మార్ట్ ఫోన్ల రవాణాలో మార్కెట్ లీడర్ గా నిలిచింది. నలుగురు యూజర్లలో ఒకరు షియోమీ స్మార్ట్ ఫోన్ మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రెడ్ మి 7ఎ, రెడ్ మి నోట్ 7 ప్రో, రెడ్ మి నోట్ 7ఎస్ కలిపి మొత్తం 50శాతానికి పైగా రవాణా జరిగినట్టు నివేదిక వెల్లడించింది.

ప్రీమియం స్మార్ట్ ఫోన్లపై మొత్తం మీద 13శాతంతో రెడ్ మి కె20సిరీస్ రవాణాపై సానుకూల వృద్ధిని చూసింది.CMR అంచనా ప్రకారం.. మొబైల్ ఫోన్ల రవాణా నాల్గో త్రైమాసికం ముగిసే నాటికి 280 మిలియన్ల యూనిట్లకు చేరనుంది.