హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి రమణమూర్తి ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : October 1, 2020 / 10:48 AM IST
హైదరాబాద్‌లో ఏపీ అటవీశాఖ అధికారి రమణమూర్తి ఆత్మహత్య

Updated On : October 1, 2020 / 11:18 AM IST

ap forest officer suicide: హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఏపీ అటవీశాఖ అధికారి వి.భాస్కర్ రమణమూర్తి ఆత్మహత్య చేసుకున్నారు. నాగోల్ లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు నుంచి రమణమూర్తి దూకేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రమణమూర్తి 1987 బ్యాచ్ కి చెందిన అధికారి. ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ అధికారిగా ఉన్నారు.