Husband hides under cot for Six Hourrs : అక్రమ సంబంధం… మంచం కింద దాక్కుని భార్య ప్రియుడ్ని హత్య చేసిన భర్త

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు అన్నట్లు....ఉద్యోగం లేదు, బతకటానికి కష్టంగా ఉందని అడిగితే.. ఉద్యోగం చూపించిన వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ప్రబుధ్దుడు. విషయం తెలుసుకున్న భర్త షాక్ కు గురై  భార్య ప్రియుడ్ని హతమార్చిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

Husband hides under cot for Six Hourrs : అక్రమ సంబంధం… మంచం కింద దాక్కుని భార్య ప్రియుడ్ని హత్య చేసిన భర్త

Husband Kills Wifes Paramour

Updated On : March 26, 2021 / 6:34 PM IST

Bengaluru Husband hides under cot for Six Hourrs to kill wife’ s lover : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు అన్నట్లు….ఉద్యోగం లేదు, బతకటానికి కష్టంగా ఉందని అడిగితే.. ఉద్యోగం చూపించిన వ్యక్తి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ప్రబుధ్దుడు. విషయం తెలుసుకున్న భర్త షాక్ కు గురై  భార్య ప్రియుడ్ని హతమార్చిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

పశ్చిమ బెంగుళూరు లోని ఆంధ్రహళ్లి లోని రోహిత్ నగర్ లో భరత్ కుమార్ అనే వ్యక్తి (31) కార్పెంటర్ గా పని చేసుకుని జీవిస్తున్నాడు. అతనికి చిక్ మంగుళూరు జిల్లా తరికెర గ్రామానికి చెందిన వినుత(31) అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు.

భరత్ కుమార్ కొన్నాళ్లకు వడ్రంగం పనిమానేసాడు. భార్యా భర్తలిద్దరూ వారి ఇంటికి సమీపంలోని నెలమంగళం వద్ద ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరారు. ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని పెంచుతూవ హాయిగా కాపురం చేసుకుంటున్నారు.

మూడేళ్ల క్రితం వినుతకు తెలిసిన వ్యక్తి , ఆమె స్వగ్రామంలోని హోసహళ్లి తండాకు చెందిన అకా శివరాజ్(27) అనే వ్యక్తి ఉద్యోగం కోసం భరత్ కుమార్ ఇంటికి వెళ్లాడు. అందుకు భరత్ అభ్యంతరం చెప్పకపోగా తనకు తెలిసిన వారికి అతని గురించి చెప్పాడు. వినుత కూడా తను పని చేస్తున్న ఫ్యాక్టరీలో వారికి చెప్పింది. మొత్తానికి శివరాజ్ కు ఈ దంపతులు ఓ చోట ఉద్యోగం ఇప్పించారు.

వినుత కూడా…. అయ్యో పాపం ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాడని, చొరవ తీసుకుని ఉద్యోగం ఇప్పించటాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నాడు శివరాజ్. అది ఆమెకు తనపై ప్రేమగా భావించాడు.

ఉద్యోగంలో చేరిన తర్వాత తరచూ వినుత వాళ్లింటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఇలావచ్చి వెళ్లే క్రమంలో ఉన్నట్టుండి శివరాజ్ వినుతకు షాకిచ్చాడు. ఐ లవ్ యూ అని చెప్పాడు ఆమెకు. ఈ మాట విన్న ఆమె ఒక్కసారి షాక్ కు గురై అతడ్ని మందలించి పంపించి వేసింది.

అయినా అతను పట్టువిడవకుండా వారింటికి వస్తూనే ఉన్నాడు. ఈక్రమంలో అనేక సార్లు తన ప్రేమను వ్యక్త పరుస్తూనే ఉన్నాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. తనను ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించేసరికి ఆమె అతనికి లొంగిపోయింది.

అతడి ప్రేమను అంగీకరించింది. క్రమేపి వారిద్దరూ సన్నిహితంగా మెలగటం ప్రారంభించారు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఈవిషయాన్ని భరత్ కుమార్ పసిగట్టాడు. పధ్ధతి మార్చుకోమని భార్యను, శివరాజ్ ను హెచ్చరించాడు. అయినా వారిద్దరూ తమ ప్రవర్తన మార్చుకోలేదు.

వినుత భరత్ ను వదిలేసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. సమీపంలోనే వేరే ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ నివసించసాగింది. అక్కడ వినుత ఇంటికి శివరాజ్ రోజూ వచ్చి వెళుతున్నాడు. సాయం చేసినందుకు తన కుటుంబంలో చిచ్చురేపిన శివరాజ్ పై భరత్ గుర్రుగా ఉన్నాడు.

తన జీవితాన్ని నాశనం చేసిన శివరాజ్ ను అంతమొందించాలనుకున్నాడు. ఆమె ప్రియుడు…ఇంటికి ఏఏ సమయాల్లో వచ్చి వెళుతున్నాడో తెలుసుకున్నాడు. బుధవారం, మార్చి 24వ తేదీ రాత్రి గం.8-30 కి భరత్, వినుత ఇంటికి వచ్చాడు. ఆసమయంలో ఆమె చికెన్ తీసుకురావటానికి బయటకు వెళ్లింది.

ఆమెకు తెలియకుండా భరత్ వినుత ఇంట్లోకి ప్రవేశించి మంచం కింద దాక్కున్నాడు. మార్కెట్ నుంచి చికెన్ తీసుకుని వినుత ఇంటికి వచ్చింది. చికెన్ వండే పనిలో పడింది. కొద్ది సేపటికి శివరాజ్ వచ్చాడు. ఇద్దరూ కల్సి భోజనం చేశారు. రాత్రి 10-30 సమయంలో ఇద్దరూ నిద్రపోయారు.

తెల్లవారు ఝూమున నిద్రలేచిన వినుత వాష్ రూమ్ కు వెళ్లింది. అప్పటి దాకా మంచం కింద దాక్కున్న భరత్ బయటకు వచ్చాడు. ఆమె లోపలకు వెళ్లగానే వాష్ రూమ్ బయట గడియపెట్టాడు. నిద్రలో ఉన్న శివరాజ్ ను తనతో తెచ్చుకున్న కత్తితో కసి తీరా పొడిచి చంపాడు.

భరత్ పొడిచిన కత్తిపోట్లకు శివరాజ్ రక్తపు మడుగులో పడి మరణించాడు. శివరాజ్ ను ఊరు చివరకు తీసుకువెళ్లి తగలబెడదామనుకున్నాడు. కానీ ఆ ఆలోచన విరమించుకుని….శివరాజ్ బంధువుకు హత్య చేసిన విషయాన్ని ఫోన్ చేసి చెప్పాడు.

వాష్ రూమ్ తలుపు తీసాడు. వినుత బయటక వచ్చి జరిగిన దారుణాన్ని చూసింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. గురువారం తెల్లవారుఝామున 4 గంటల సమయంలో ఘటనా స్ధలానికి వచ్చిన బైదర హళ్లి పోలీసులు భరత్ ను అదుపులోకి తీసుకున్నారు. శివరాజ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.