ఉద్యోగం ఇచ్చి సహాయం చేస్తాడనుకుంది- స్నేహితుడితో కలిసి…

ఉద్యోగం ఇచ్చి సహాయం చేస్తాడనుకుంది- స్నేహితుడితో కలిసి…

Updated On : December 22, 2020 / 10:43 AM IST

Delhi Woman lured on pretext of job, gang-raped by 2 men : సోషల్ మీడియా లో పరిచయం అయిన స్నేహితుడు తనకు సహాయం చేయటానికి ఉద్యోగం ఇచ్చాడు. ఇంటర్వ్యూ కోసం రమ్మని స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగింది.

ఢిల్లీలోని మితాపూర్ కు చెందిన డిగ్రీ చదివిన యువతికి సోషల్ మీడియాలో ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ కు చెందిన ఎహతేషామ్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్ చేసుకుని మంచి స్నేహితులుగా ఉన్నారు. తాను ఒక ఆన్ లైన్ ఎగుమతి సంస్ధకు మేనేజర్ గా పరిచయం చేసుకున్నాడు. డిగ్రీ చదివిని యువతి తనకు ఉద్యోగం కావాలని చెప్పటంతో తన కంపెనీలోనే ఇస్తాను అని చెప్పి ఆమెకు ఉద్యోగం ఇచ్చాడు. ఇంటర్వ్యూకోసం మొరాదాబాద్ రావాలని చెప్పాడు. ఆ యువతి డిసెంబర్19 శనివారం బస్సులో ఢిల్లీ నుంచి యూపీలోని మొరాదాబాద్ చేరుకుంది.

సోషల్ మీడియా స్నేహితుడు బస్టాండ్ కువచ్చి ఆమెను రిసీవ్ చేసుకుని బుద్ విహార్ లోని హోటల్ రూమ్ కు తీసుకు వెళ్ళాడు. అక్కడ అప్పటికే ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆ యువతి ప్రయాణ బడలిక తీర్చుకున్న తర్వాత ఆమెను ఇంటర్వ్యూ చేస్తామని చెప్పారు. ఆమె రెడీ అయిన తర్వాత తాగటానికి కూల్ డ్రింక్ ఇచ్చారు. అది తాగిన తర్వాత ఆ యువతి స్పృహ తప్పి పడిపోయింది. తన స్నేహితుడితో కలిసి ఎహతేషామ్‌ ఆ యువతిపై అత్యాచారం చేసి స్నేహితులిద్దరూ పారిపోయారు. స్పృహలోకి వచ్చిన యువతి తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించింది. హోటల్ సిబ్బందిని నిందితుల గురించి వారి గురించి ఎంక్వైరీ చేయగా వారిగురించి ఏమీ సమాచారం ఇవ్వలేక పోయారు.

బాధితురాలు స్ధానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హోటల్ కు వచ్చి సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా నిందితులను ఉత్తరాఖండ్ లోని కాశిపూర్ కు చెందిన రాజా, ఎహతేషామ్‌గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా…. ఈవిషయం తెలిసిన కొందరు మితవాదులు పోలీసు స్టేషన్ కు వచ్చి కేసును లవ్ జిహాద్ కేసుగా మార్చమని ఒత్తిడి చేయగా పోలీసులు అందుకు నిరాకరించారు. నిందిుతులపై ఐపీసీ పెక్షన్ లోని అత్యాచార నేరం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.