నకిలీ వేలిముద్రలతో పాస్‌పోర్ట్స్‌ : నిందితులపై దేశద్రోహం కేసు

పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ వేలిముద్రల ముఠా గుట్టురట్టయింది. శ్రీలంకకు చెందిన ప్రధాన నిందితుడు సహా ఐదుగురు నిందితులను పాలకొల్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

  • Published By: veegamteam ,Published On : September 7, 2019 / 06:49 AM IST
నకిలీ వేలిముద్రలతో పాస్‌పోర్ట్స్‌ : నిందితులపై దేశద్రోహం కేసు

Updated On : September 7, 2019 / 6:49 AM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ వేలిముద్రల ముఠా గుట్టురట్టయింది. శ్రీలంకకు చెందిన ప్రధాన నిందితుడు సహా ఐదుగురు నిందితులను పాలకొల్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ వేలిముద్రల ముఠా గుట్టురట్టయింది. ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌ ద్వారా పాస్‌పోర్ట్స్‌ ఇప్పిస్తూ.. విదేశాలకు పంపిస్తున్న దందా బట్టబయలైంది. శ్రీలంకకు చెందిన ప్రధాన నిందితుడు సహా ఐదుగురు నిందితులను పాలకొల్లు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు.

శ్రీలంకకు చెందిన మహ్మద్‌ జాఖీర్‌ హుస్సేన్‌ దేశంలో పలు చోట్ల ముఠాలను ఏర్పాటు చేసుకున్నాడు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వేలిముద్రలను కట్‌ చేసి ఆ స్థానంలో వేరే వేలిముద్రల గుర్తులతో ఆపరేషన్‌ చేస్తున్నారు. ఇలా నకిలీ వేలిముద్రలతో ఆధార్‌ కార్డ్‌.. పాస్‌పోర్ట్‌ తీసుకొని వారిని విదేశాలకు పంపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ దందా విస్తరించగా.. పాలకొల్లు పోలీసులు ఈ గుట్టును రట్టు చేశారు.

కడపకు చెందిన వారు కూడా ఈ నకిలీ దందాలో పాలు పంచుకున్నట్టు గుర్తించారు పోలీసులు. నకిలీ ముఠాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పాస్‌పోర్ట్స్‌, రెండు సర్జికల్‌ కిట్స్‌, ఐదు సెల్‌ఫోన్లు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

Also Read : ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం : కొత్తగా 3 మెట్రో లైన్లు