సిద్ధిపేటలో దారుణం : పిల్లలను చంపేసి తండ్రి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులు..క్షణికావేశాలు..ఇతరత్రా రీజన్స్‌తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అభం..శుభం తెలియని చిన్నారులను కూడా చంపేస్తున్నారు పేరెంట్స్. సిద్ధిపేట జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ తండ్రి..ఇద్దరు పిల్లలను చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులే ఇందుకు కారణమని స్థానికులు తెలియచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
Also Read : శ్రీలంకలో పేలుళ్ల దర్యాప్తు : ఆరుగురు అనుమానితుల ఫొటోలు రిలీజ్
సిద్ధిపేట..దుబ్బాక మండలం లచ్చపేటలో బడుగు రాజు, లక్ష్మీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి భవానీ (9) లక్ష్మీ (5) కూతుళ్లున్నారు. అయితే ఏడాది క్రితం అనారోగ్యంతో రాజు భార్య లక్ష్మీ మృతి చెందింది. దీంతో రాజు కృంగిపోయాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇంటి అవసరాలు తీర్చడం..కూతుళ్లను పెంచడానికి రాజుకు కష్టమయ్యేది. మద్యానికి..ఇతరత్రా అవసరాలకు పలువురి వద్ద అప్పులు చేశాడు రాజు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవాడు.
ఏప్రిల్ 25వ తేదీ గురువారం భవానీ, లక్ష్మీలకు బలవంతంగా ఉరి వేసి చంపేసిన అనంతరం రాజు..ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 26వ తేదీ స్థానికులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే పిల్లలను చంపేసి..ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని స్థానికులు అనుకుంటున్నారు.
Also Read : శ్రీలంకలో మళ్లీ ఉగ్రదాడులు : అమెరికా హెచ్చరిక