Road Accident Four killed : పూజ కోసం వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మధ్యప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్దా నుంచి కాన్పూర్‌ వెళ్తుండగా బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హర్దాకు చెందిన శుక్లా కుటుంబం అష్టమి పూజల కోసం కారులో కాన్పూర్‌కు వెళ్తున్నారు. 

Road Accident Four killed : పూజ కోసం వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Road Accident Four killed

Updated On : October 2, 2022 / 9:52 PM IST

Road Accident Four killed : పూజ కోసం వెళ్తుండగా విషాదం నెలకొంది. మధ్యప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొని నలుగురు వ్యక్తులు మృతి చెందారు. హర్దా నుంచి కాన్పూర్‌ వెళ్తుండగా బెర్ఖెడి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హర్దాకు చెందిన శుక్లా కుటుంబం అష్టమి పూజల కోసం కారులో కాన్పూర్‌కు వెళ్తున్నారు.  మార్గంమధ్యలో ఎదురుగా వస్తున్న ట్రక్కును కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మోహిత్ శుక్లా (40), అతని భార్య దక్ష అలియాస్ శ్రద్ధా శుక్లా (35), దంపతుల కూతుళ్లు లావణ్య శుక్లా (11) మాన్య శుక్లా (6) మృతి చెందారు. పంకజ్‌ శుక్లా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. పరిస్థితి విషమంగా ఉంది. కారును ట్రక్కు పక్క నుంచి ఢీకొట్టిందని, ఆ తర్వాత 10 అడుగుల దూరం కారును లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Road Accident Two Killed : నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..తండ్రీకొడుకులు మృతి

కారులో ఉన్న వారంతా కేకలు వేయగా.. అక్కడే ఉన్న పలువురు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. కారు దెబ్బతినడంతో దంపతులతో పాటు వారంతా అందులోనే చిక్కుకుపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కట్టర్ల సహాయంతో కారులో నుంచి వారిని బయటకు తీయగా.. ఇప్పటికే నలుగురు మృతి చెందారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.