Extra Marital Affair : అక్రమ సంబంధం నిరూపించమన్న భార్య …ప్రియుడితో సహా భార్యను పట్టుకుని కట్టేసిన భర్త

Extra Marital Affair : అక్రమ సంబంధం నిరూపించమన్న భార్య …ప్రియుడితో సహా భార్యను పట్టుకుని కట్టేసిన భర్త

Extra Marital Affair

Updated On : May 26, 2021 / 11:39 AM IST

Extra Marital Affair  : భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నావని వేధించసాగాడు. అందుకు ఒప్పుకోని భార్య.. తన వివాహేతర సంబంధాన్ని నిరూపించాలని భర్తను సవాల్ చేసింది. సమయం కోసం వేచి చూసిన భర్త, భార్యను ఆమె ప్రియుడ్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

వల్సాద్ జిల్లాలోని ఓ గ్రామంలో వ్యవసాయ కూలీగా పని చేసే వ్యక్తి భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి..వివాహేతర సంబంధం పెట్టుకున్నావని భార్యను వేధించసాగాడు. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

ఈక్రమంలో తన వివాహేతర సంబంధాన్ని నిరూపించాలని భార్య, భర్తను సవాల్ చేసింది. అనంతరం కాజ్లి గ్రామంలో తన పుట్టింటికి వెళ్లి అక్కడ తల్లితో కలిసి నివసించసాగింది. అవకాశం కోసం ఎదురు చూసిన భర్త భార్యపై నిఘా పెట్టాడు.

ఆదివారం మే 23న, అతడి భార్య ప్రియుడిని కలిసింది. సమాచారం తెలుసుకున్న భర్త, వారిద్దరూ సన్నిహితంగా ఉండగా పట్టుకున్నాడు. ఇద్దరినీ ఇంట్లోంచి బయటకు తీసుకు వచ్చి స్తంభానికి కట్టేసి వారిని కొట్టాడు. స్ధానికులు జోక్యం చేసుకోవటంతో వారిని విడిచి పెట్టాడు.

ఈ ఘటనను కొందరు గ్రామస్తులు వీడియోతీసి అక్కడి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వైరల్ అయిన వీడియో ద్వారా సమాచారం అందుకున్న నానాపొంధ పోలీసులు మహిళ ప్రియుడ్ని పిలిచి ఫిర్యాదు చేయమని కోరారు. అందుకు అతడు నిరాకరించాడు. అతని భార్య కూడా ముందుకు రాకపోవటంతో… పోలీసులు ముందు జాగ్రత్తగా నిందితుడిని అదుపులోకి తీసుకుని బెయిల్ పై విడుదల చేశారు.