Drugs Seized : హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు.

Hyderabad Drugs Seized
Drugs Seized : హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. ముగ్గురుని అదుపులోకి తీసుకుని వారివద్దనుంచి 30 గ్రాముల నిషేధిత డ్రగ్స్ ను, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో 8 మంది డ్రగ్ రిసీవర్స్ ను గుర్తించామని వారిని త్వరలోనే పట్టుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు.
మహారాష్ట్రకు చెందిన నవనార్ అను, యూసఫ్‌గూడా కు చెందిన మహమ్మద్ అబ్దుల్, మహమ్మద్ ఖాజా మోహనుద్దిన్ లను ఈరోజు అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. నవనార్ పుణేలో ఉండి డ్రగ్స్ ఫెడ్లర్‌లను ఎంగేజ్ చేసుకుని అక్కడి నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువచ్చి విక్రయిస్తూ ఉంటాడు. పూణేలో నవనార్ తో సంబంధం ఉన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
నవనార్ కు హైదరాబాద్ లో ప్రధాన డ్రగ్ పెడ్లర్ గా అబ్దుల్ ఉన్నాడని ఆయన తెలిపారు. అబ్దుల్ మరో నలుగురి ద్వారా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడు.వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారని.. వీరితో పాటు మరో 8 మంది కస్టమర్లను కూడా గుర్తించామని వీరందరినీ త్వరలోనే పట్టుకుంటామని ఆయన అన్నారు.
నవనార్ ముంబై లో డ్రగ్స్ పెడ్లర్ గా ఉండేవాడని… నైజీరియన్స్ పరిచయంతో ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి పూణేలో విక్రయిస్తున్నాడని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా పూణే పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడని ఈరోజు పోలీసులకు దొరికిపోయాడని జోయల్ డేవిస్ చెప్పారు. డ్రగ్స్ కొనుగోలు,రవాణా, అమ్మకాలపై సమాచారం ఉంటే నార్కోటిక్స్ వింగ్ కు సమాచారం ఇవ్వాలని డీసీపీ కోరారు.
Also Read : Revanth Reddy : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ మేయర్,నేతలు