Maharashtra : మహారాష్ట్రలో విషాదం.. హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్రిప్రమాదం.. ఆరుగురు కార్మికులు సజీవదహనం

మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు

Maharashtra : మహారాష్ట్రలో విషాదం.. హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్రిప్రమాదం.. ఆరుగురు కార్మికులు సజీవదహనం

Maharashtra Fire Accident

Updated On : December 31, 2023 / 7:37 AM IST

Maharashtra Fire Accident : మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించడంతో ఆరుగురు కార్మికులు మరణించారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఆదివారం తెల్లవారుజామున ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం సభవించిన సమయంలో కూలీలంతా ఫ్యాక్టరీలో నిద్రిస్తున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఆరుగురు సజీవదహనం అయ్యారు.

Also Read : New Year 2024: న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసుల సరికొత్త ప్రయోగం.. ఇలా దొరికిపోతారంతే..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో హ్యాండ్ గ్లవ్స్ తయారీ కంపెనీలో తెల్లవారు జామున 2.15గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న భవనంలో కంపెనీ కాటన్ హ్యాండ్ గ్లవ్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఉన్నట్లుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించిన సమయంలో భవనంలో 10 నుంచి 15 మంది ఉన్నారు. అయితే, అగ్నిప్రమాదం ఘటన నుంచి కొందరు కార్మికులు తప్పించుకోగా.. మరికొందరు లోపల చిక్కుకుపోయారు. అధికారుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, అప్పటికే ఆరుగురు కార్మికులు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు.

Also Read : New Year 2024 : హైదరాబాద్‎లో కఠినంగా న్యూఇయర్ ఆంక్షలు..

అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు. మంటలు చెలరేగిన సమయంలో కార్మికులు భవనంలో నిద్రిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారిలో మీర్జాపూర్ కు చెందిన భల్లా షేక్, కౌసర్ షేక్, ఇక్బాల్ షేక్, మగ్రూఫ్ షేక్, మరో ఇద్దరు ఊపిరాడక మరణించారు.