ఆవుని కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఫామ్ హౌస్ ఇంచార్జి అరెస్ట్

  • Published By: naveen ,Published On : October 27, 2020 / 04:34 PM IST
ఆవుని కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఫామ్ హౌస్ ఇంచార్జి అరెస్ట్

Updated On : October 27, 2020 / 5:40 PM IST

sania mirza : సంచలనం రేపిన వికారాబాద్ అడవుల్లో కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫామ్ హౌస్ సెక్యూరిటీ ఇంచార్జి ఉమర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.




ఉమర్ నాలుగు రోజుల క్రితం ఆవుని కాల్చి చంపాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కాల్పులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించారు. కాగా, ఉమర్ కు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.