AP Constable Results 2025: ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

AP Constable Results 2025: ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగరి డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

AP Constable Results 2025: ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

Andhra Pradesh Police Constable Final Results Released

Updated On : August 1, 2025 / 10:26 AM IST

ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళగరి డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ ద్వారా అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోచ్చు. ఇక ఏపీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ అక్టోబర్ 2022లో విడుదలైన విషయం తెలిసిందే. 2023లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించగా 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో కేవలం 95,208 మంది అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు, ఫిజికల్ టెస్టులు 2024 డిసెంబరులో పూర్తి చేయగా 38,910 మంది అర్హత సాధించారు.

ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలై దాదాపు రెండేళ్లకుపైగా అవుతోంది. పలు కారణాల వల్ల ఫలితాల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆగస్టు 1 2025న దీనికి సంబందించిన తుది ఫలితాలను విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ శాఖలో సిబ్బంది కొరత చాలా ఉంది. అందుకే పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై దృష్టి సారించింది సర్కార్. అందుకే ఈ నియామక ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని నిర్ణయించింది.