JOBS : ఎన్ సీసీఎస్ లో ఒప్పంద ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందియన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ,పీజీ,పీహెచ్‌డీ,ఎండీ,ఎంఎస్‌,ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

JOBS : ఎన్ సీసీఎస్ లో ఒప్పంద ఉద్యోగ ఖాళీల భర్తీ

Jobs (2)

Updated On : July 24, 2022 / 5:56 PM IST

JOBS : భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పూణెలోని నేషనల్ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, కన్సల్టెంట్(సైంటిఫిక్) తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల వివరాలకు సంబంధించి రిసెర్చ్ అసోసియేట్-1 పోస్టులు 1 ఖాళీ, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు 1ఖాళీ, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు 3 ఖాళీలు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు 1ఖాళీ, కన్సల్టెంట్(సైంటిఫిక్) పోస్టులు 1 ఖాళీ ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 64 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతల విషయానికి వస్తే పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందియన ఇన్‌స్టిట్యూట్‌ లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ,పీజీ,పీహెచ్‌డీ,ఎండీ,ఎంఎస్‌,ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్‌,గేట్‌లో వ్యాలిడ్ స్కోర్ సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. వేతనంగా నెలకు రూ.31,000ల నుంచి రూ.90,000ల వరకు చెల్లిస్తారు. దరఖాస్తులు పంపటానికి ఈ మెయిల్‌ ఐడీ: admindept@nccs.res.in, కన్సల్టెంట్(సైంటిఫిక్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ తేదీ ఆగస్టు 21, 2022గా నిర్ణయించారు. ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ తేదీ: ఆగస్టు 3, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.indiascience.in/ పరిశీలించగలరు.