అప్లై చేసుకోండి : ISRO లో 182 ఉద్యోగాలు

బెంగుళూర్ లోని యూ ఆర్ రావు శాటిలైట్ సెంటర్(URSC) లోని టెక్నీషియన్, అసిస్టెంట్, వివిధ ద్యోగాల భర్తీకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 182 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా విద్యార్హతలు నిర్ణయించబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
టెక్నీషియన్ B – 102
డ్రాప్ట్స్ మెన్ B – 3
టెక్నీషియన్ అసిస్టెంట్ – 41
లైబ్రరీ అసిస్టెంట్ – 4
సైంటిఫిక్ అసిస్టెంట్ – 7
హిందీ టైపిస్ట్ – 2
క్యాటరింగ్ అటెండెంట్ A – 5
కుక్ – 5
ఫైర్ మెన్ – 4
లైట్ వెహికిల్ డ్రైవర్ – 4
హేవీ వెహికిల్ డ్రైవర్ – 5
విద్యార్హత : అభ్యర్దులు 10వ తరగతి, డిప్లామా ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. హిందీ టైపిస్ట్ పోస్ట్ అభ్యర్దులు మాత్రం నిమిషానికి 25 పదాలను టైప్ చేయగలగాలి.
వయోపరిమితి : అభ్యర్దుల వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబిసీ, EWS అభ్యర్దులు రూ.250 చెల్లించాలి. SC,ST, ఎక్స్ – సర్వీస్ మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్దులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపికా విధానం : అభ్యర్దులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 15, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 6, 2020.
Read More>>ఆర్మీ కమాండ్ పోస్టులకు మహిళలు అర్హులే..శాశ్వత హోదా మంజూరు చేయాలి : సుప్రీం