అప్లై చేసుకోండి : JIPMER లో ఉద్యోగాలు

జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 107 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా గ్రూప్ B, గ్రూప్ C పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రూప్ B పోస్టులు :
నర్సింగ్ ఆఫీసర్ – 85
మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ – 15
జూనియర్ ఇంజనీయర్ – 1
ఫిజికల్ ఇన్ స్ట్రక్టర్ – 1
సైకియాట్రిక్ నర్స్ – 1
ఎలక్ట్రానిక్స్ అసిస్టెంట్ – 1
గ్రూప్ C పోస్టులు :
ఈఈజీ టెక్నీషియన్ – 1
యూరో టెక్నీషియన్ – 1
డెంటల్ మెకానిక్ – 1
విద్యార్హత : అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ, డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్, ఓబిసీ అభ్యర్ధులు రూ.1500 చెల్లించాలి. SC,ST అభ్యర్ధులు రూ.1200 చెల్లించాలి. దివ్యాంగులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపికా విధానం :
అభ్యర్ధులను కంప్యూటర్ బేస్ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : డిసెంబర్ 18,2019
దరఖాస్తు చివరి తేది : జనవరి 20,2020
అడ్మిట్ కార్డు జారీ తేది : ఫిబ్రవరి 3,2020
ఆన్ లైన్ పరీక్ష తేది : ఫిబ్రవరి 23,2020