Jobs : దామోదర్ వాలీ కార్పోరేషన్ లో ఉద్యోగాల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 29 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Dvc
Jobs : భారత ప్రభుత్వానికి చెందిన కోల్‌కతాలోని దామోదర్ వాలీ కార్పొరేషన్ (DVC)లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల వివరాలకు సంబంధించి మెకానికల్ పోస్టులు 22 ఎలక్ట్రికల్ పోస్టులు 22 సివిల్ పోస్టులు 5 కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ పోస్టులు 5 ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు 2 ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 29 సంవత్సరాలకు మించరాదు. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్ 2022లో వ్యాలీడ్ స్కోర్ సాధించి ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 6, 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమౌతుంది. పూర్తి వివరాలకు https://www.dvc.org.in/ పరిశీలించగలరు.